వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోప్యదానం శ్రేష్టం

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు, ఫోన్: 9440611151

దానం చేయటం చాల ఉత్తమమైన విషయం. అయితే అది ప్రచారం ఏమాత్రం లేకుండా చేయాలి. తాము చేసిన దానాన్ని గొప్పగా చెప్పుకుంటే , దానివలన లభించిన పుణ్యంకూడా నశిస్తుంది . ' ధర్మః క్షరతి కీర్తనాత్ ' అని శాస్త్రం చెప్తుంది.

అలాగే మన ఇంటికొచ్చే అతిధులను ఆప్యాయంగా ఆహ్వానించాలి . ' అతిధి దేవోభవ ' అని శాస్త్రం చెప్తోంది. మన ఆహ్వానం లేకపోయినా , మన గృహానికి మహానుభావులైన వారు విచ్చేస్తే అది మన అదృష్టంగా భావించాలి.

'అభాగ్యతః స్వయం విష్ణుః ' అని చెప్పబడింది. మంచిపని చేసినా , దానికి తామే కారణమని చెప్పుకుని పేరు కోసం ప్రయత్నించకూడదు . మనకు యితరులకు చేసిన మేలును మరువకూడదు. అలా మరిచిపోవటం కంటే తీవ్రమైన పాపం మరొకటి ఉండదు . అటువంటి పాపానికి ప్రాయశ్చితం లేదు . ' కృతఘ్నే నాస్తి నిష్కృతి: ' అని శాస్త్రాలు చెప్తున్నాయి . అందువలన కృతజ్ఞత కలిగి ఉండాలి.

Behind non disclosure donation

భగవంతుని కృపా విశేషము వలననే మనకు ఐశ్వర్యం లభించింది . అందువలన ఆ ఐశ్వర్యాన్ని దైవసేవలో , పరోపకారములో వినియోగించాలి . అలా కాకుండా ఐశ్వర్యాన్ని చూసుకుని గర్వాన్ని తెచ్చుకోకూడదు . ఐశ్వర్యాన్ని దుర్వినియోగం చేయకూడదు . ఎంతటి ధనవంతులైన గర్వం పనికిరాదు. వినయంగా , మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి .

మనం ఎవరికీ హాని చేయకూడదు . యితరుల గురించి నీచంగా మాట్లాడకూడదు . యితరులను కించపరిచి మాట్లాడితే , వారికి బాధ కలుగుతుంది . అది మనకే మంచిది కాదు . అందువలన మనం ఎప్పుడూ యితరుల గురించి మంచే మాట్లాడాలికానీ చెడు కాదు .

English summary
Behind non disclosure donation in Hindu religion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X