రెండుసార్లు రాశిని మార్చనున్న బుధుడు.. ఈ రాశులవారికి తిరుగులేదు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం కొంత సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. అలాగే జూన్ లో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయి. ఈ నెలలో రెండు సార్లు బుధుడు తన రాశిని మార్చనున్నాడు. జూన్ మొదటి వారంలో ఒకసారి, చివరి వారంలో మరోసారి తన రాశిని మార్చనున్నాడు. ప్రస్తుతం బుధుడు మేషరాశిలో సంచరిస్తుండగా ఈనెల 7వ తేదీ వృషభ రాశిలోకి, 24న మిథునరాశిలో సంచరించనున్నాడు. దీనివల్ల నాలుగు రాశులకు కలిసి రానుంది. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.

వృషభరాశి : బుధుడు మొదటిగా ఈ రాశిలోనే సంచరిస్తాడు. దీనివల్ల వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఊహించని రీతిలో ధనలాభం కలగడంతోపాటు వ్యాపారస్తులు మంచి లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగం లేనివారికి మంచి కంపెనీల్లో ఉద్యోగం దొరుకుతుంది. ఇంక్రిమెంట్ తోపాటు పదోన్నతి కూడా లభిస్తుంది.

 horoscope

మిథునరాశి : వృషభరాశి తర్వాత బుధుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల వారి కెరీర్ అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులకు భారీగా లాభం ఉంటుంది. చేపట్టే ప్రతి పనిలోను వీరు విజయం సాధిస్తారు. ఏ రంగంలోకి అడుగు పెడితే ఆ రంగంలో విజయవంతమవుతారు. డబ్బును సంపాదించడంతోపాటు భారీగా పొదుపు కూడా చేస్తారు.

సింహరాశి : జూన్ నెల సింహ రాశి వారికి అదృష్టాన్ని తెస్తోంది. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో మానసిక ప్రశాంతతను పొందుతారు. అంతేకాదు.. జీవితాన్ని చాలా లగ్జరీగా గడుపుతారు. కోరికలన్నీ నెరవేరతాయి.

ధనుస్సు రాశి : ధనుస్సు రాశివారికి బుధుడి సంచారం ఊహించని ఫలితాలను ఇవ్వబోతోంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరగడమే కాక వివాహం కూడా అవుతుంది. జీవితంలో ఆనందం వెల్లివిరియడంతోపాటు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. దాంపత్య జీవితం ఆనందకరంగా సాగుతుంది. గతంలో మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+