గ్రహాల గమనంలో మార్పులు.. 5 రాశులకు ఐశ్వర్యం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల రాశిచక్రం మారడంవల్ల ప్రతి మనిషి జీవితంలో లాభనష్టాలు కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఏప్రిల్ నెలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈనెలలోనే సూర్య, బుధ, గురు, శుక్ర గ్రహాల పరివర్తనం ఉంది.
గురుడు ఏప్రిల్ 2023లో సొంతరాశి మీనం నుంచి బయటికొచ్చి మేషరాశిలో ప్రవేశించనున్నాడు. మేష రాశిలో అప్పటికే రాహువుతో కలిసి సూర్యుడు ఉండటంవల్ల 22వ తేదీ నుంచి మేషరాశిలో గురు, రాహు గ్రహాలు గురు చండాల యోగం ఏర్పరుస్తాయి. అంగారక గ్రహాన్ని గ్రహాల అధిపతిగా చెబుతారు. మార్చి 13, 2023న అంగారక గ్రహం మిథునరాశిలోకి ప్రవేశించింది. కుజుడు మే 10వ తేదీ వరకు ఇక్కడే ఉంటాడు. 10 తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించడం, మే 2వ తేదీ వరకు అక్కడే ఉండటం, శుక్ర, శని గ్రహాలు 4, 5 దశల్లో ఉండటంల్ల ఐదు రాశులవారికి బాగా కలిసిరానుంది.

కర్కాటక రాశివారికి చాలా బాగుంటుంది. ఉద్యోగులకు ఊహించని రీతిలో కొత్త అవకాశాలు లభిస్తాయి. డబ్బు విషయాల్లో విజయం సాధించడమే కాకుండా అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంది. మహిళలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. జీవితంలో బాగా సంపాదిస్తారు.
వృషభ రాశి
వృషభరాశి జాతకులకు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. పదోన్నతి లభిస్తుంది. అయితే ఏ విధమైన అగ్రిమెంటు లేదంటే చట్టపరమైన కాగితాలపై సంతకం చేయకుండా ఉంటేనే మంచిది. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. కొత్త ప్రాజెక్టుకు సంబంధించినవారికి ధనలాభం ఉంటుంది. అయితే ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు.
మిథున రాశి
కెరీర్ లో లాభముంటుంది. స్నేహితుల సహకారంతో విజయం సాధిస్తారు. రిస్క్ చేసి ముందుకువెళ్లినవారికి తప్పకుండా విజయం వరిస్తుంది. నెలమొత్తం వీరికి శుభప్రదంగా ఉంటుంది.
కుంభ రాశి
గ్రహాల గోచారం ఫలితంగా ఏప్రిల్ నెల వీరికి అత్యంత శుభసూచకం. ఆర్ధికంగా లాభాలుండటంతోపాటు కెరీర్‌లో ఊహించని వృద్ధి ఉంటుంది. కార్యాలయంలో కూడా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. ఇంక్రిమెంట్ లభిస్తుంది. జీవిత భాగస్వామి సహకారంతో అతి పెద్ద ఇబ్బంది నుంచి బయటపడతారు.
మీన రాశి
గౌరవం పెరుగుతుంది. కార్యాలయంలో అన్ని కలిసి వస్తాయి. సరైన సమయానికి అందాల్సిన డబ్బు అందడంతో డబ్బు సంపాదనకు కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.












Click it and Unblock the Notifications