నవరాత్రుల్లో ఈ ఒక్కపని చేయడి.. దుర్గాదేవి బోషాణాల నిండా డబ్బును పంపిస్తుంది
దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఒక్కోరోజు ఒక్కో అలంకారంతో అమ్మవారిని పూజిస్తాం. అంతేకాదు కోరికలు నెరవేరడం కోసం మంత్రాలను పఠిస్తాం. అమ్మవారు అనుగ్రహించాలంటే ఆమె భక్తుడిగా కోరికలను నెరవేర్చుకోవాలంటే శ్రద్ధతో, భక్తిగా మంత్రాలను పఠించాలి. 12వ తేదీతో విజయ దశమి ముగుస్తుంది. జీవితం ఆనందమయం కావాలంటే, సంతోషంగా గడివాలంటే, ఆనందంగా జీవించాలంటే అమ్మవారిని పూజించాలి. తొమ్మిది రోజులు దుర్గాదేవిని స్తుతించాలి. దీనివల్ల అమ్మ అనుగ్రహిస్తుంది. ఒక్కో మంత్రం ఒక్కో దేవికి సంబంధించినది. పూజ చేసే సమయంలో వీటిని పఠించండి.
అన్నిరకాలుగా మమ్మల్ని కాపాడుతూ అన్నిరకాల సౌభాగ్యాలను అందించే అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తన కోరికలు తీర్చే నారాయణవి, గౌరివి నీవే.. నిన్ను నేను శరణు వేడుకుంటున్నాను అనే అర్థం వచ్చేలా ఈ మంత్రాన్ని పఠించాలి.

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబికే గౌరి నారాయణి నమోస్తుతే
తల్లి ప్రేమకు, జ్ఞానానికి, శాంతికి, అన్ని జీవుల్లో ఉండే దుర్గామాతకు గౌరవంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామనే అర్థం వచ్చేలా ఈ మంత్రాన్ని పఠించాలి.
యా దేవి సర్వ భూతేషు, శాంతి రూపేణ సంస్థితా
యా దేవి సర్వ భూతేషు శక్తు రూపేణ సంస్థితా
యా దేవి సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా
యా దేవి సర్వ భూతేషు బుద్ధి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
సర్వా బాధా వినిర్ముక్తో ధన్ ధాన్య సుతాన్వితః
మనుష్యో మత్ర్ససాదేవ్ భవిష్యతి న సంశయః
జీవితంలోని అడ్డంకులు, సమసూయలు తొలగించమని అమ్మవారిని వేడుకుంటూ ఈ మంత్రం జపిస్తారు. దయ, సంపద, భక్తి, ఆనందం, శ్రేయస్సును ప్రసాదించమని కోరుకుంటూ ఈ మంత్రం జపించాలి.
అమ్మవారిని వివిధ పేర్లతో పిలుస్తూ ఆమె అనుగ్రహం, రక్షణ కోరుతూ ఈ మంత్రం పఠించాలి
ఓం జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలినీ
దుర్గా క్షమాశివ ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుత్
స్కంద మాతకు అంకితం చేసిన మంత్రం ఇది
ఓం దేవి స్కందమాతాయై నమః
దుర్గాదేవి ఉగ్రరూపమైన కాత్యాయనీ దేవికి అంకితం చేసిన మంత్రం ఇది
ఓం దేవి కాత్యాయనియై నమః
చీకటిని, చెడును నాశనం చేసి భయం నుంచి బయటపడవేయడానికి ఈ మంత్రం పఠించాలి
ఓం దేవి కాలరాత్రియై నమః
మహాగౌరికి అంకితం చేసిన మంత్రం ఇది.. నేను మహాగౌరికి నమస్కరిస్తున్నానని అర్థం వస్తుంది.
ఓం దేవి మహాగౌర్యాయై నమః
దుర్గాదేవి అన్ని రూపాలను స్తుతించే మంత్రం ఇది.. దీన్ని పఠించడంవల్ల జీవితంలోని అన్ని భయాల నుంచి విముక్తి కలుగుతుంది.
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితేయ్ భయేభ్యః
త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే












Click it and Unblock the Notifications