Today Rasi Phalalu :బలపడుతున్న సూర్య, శని గ్రహాలు.. ఈ రాశులపై ఊహించని ప్రభావం

మేషం (Aries): మీరు చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా, సకాలంలో వాటిని పూర్తి చేయగలుగుతారు. సంతానం కొన్ని విషయాలలో మీతో విభేదించే అవకాశం ఉంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు తలెత్తవచ్చు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. పాత అప్పుల ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం (Taurus): ముఖ్యమైన వ్యవహారాలలో మీ సొంత ఆలోచనలు అంతగా పనిచేయకపోవచ్చు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదనలు ఏర్పడతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలలో జాప్యం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

daily horoscope for september 22th 2025

మిథునం (Gemini): ఈరోజు ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని చికాకు పెడతాయి. అవసరాలకు అప్పులు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులు మీ పనితీరుపై అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

కర్కాటకం (Cancer): ఈరోజు మీరు చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.

సింహం (Leo): వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. కాలం మీకు అన్ని విధాలా సహకరిస్తుంది. గౌరవ సత్కారాలు పొందే అవకాశం ఉంది. మిత్రుల సహకారం లభిస్తుంది. రవి ధ్యానం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడం మంచిది. భూమికి సంబంధించిన వ్యవహారాలలో లాభాలుంటాయి.

కన్య (Virgo): ఆర్థికంగా అనుకూలమైన రోజు. అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. కుటుంబంలో ఆనందం, సంతోషం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

తుల (Libra): ఈరోజు మీకు అనుకోని ఆర్థిక లాభాలు ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం (Scorpio): మీరు మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. అంతా అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ దర్శనం వల్ల శుభం కలుగుతుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించడం మంచిది.

ధనుస్సు (Sagittarius): ఈరోజు మీరు కొన్ని ఒత్తిళ్లకు గురవుతారు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులలో జాప్యం ఉంటుంది. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగంలో అదనపు పనిభారం ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించుకోండి.

మకరం (Capricorn): చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో పై అధికారుల సహకారం లభిస్తుంది. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది.

కుంభం (Aquarius): ఈరోజు మీరు కొన్ని విషయాలలో ఆందోళన చెందుతారు. ప్రయాణాలు అనుకూలించకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలలో నిరాశ ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా ఉంటాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది.

మీనం (Pisces): ఈరోజు మీరు అనూహ్యమైన లాభాలు పొందుతారు. పాత అప్పులు తీరుస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో మీ స్థానాన్ని పదిలం చేసుకుంటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+