దసరా ప్రత్యేకం: దుర్గామాత స్వరూపమే కాత్యాయని
కాత్యాయని
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ
దుర్గామాత యొక్క ఆఱవ స్వరూపనామము కాత్యాయని, పూర్వము కత నామకుడైన ఒక ప్రసిద్ధ మహర్షి గలడు. అతని కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్యగోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ఇతడు పరాంబా దేవిని ఉపాసించుచు పెక్కు సంవత్సరములు కఠినమైన తపస్సును ఆచరించెను.
దుర్గాదేవి (భగవతీదేవి) పుత్రికగా తన ఇంట జన్మింపవలెనని అతని కోరిక. భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరించెను. కొంతకాలము పిమ్మట మహిషాసురుడు అను రాక్షసుని అత్యాచారములు భూలోకమున పెచ్చరిల్లెను. ఈ మహిషాసురుని సంహరించుటకై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టించిరి. మొట్టమొదట కాత్యాయన మహర్షిఈమెను పూజించెను. అందువలన ఈమె కాత్యాయని అని ప్రసిద్ధికెక్కెను.

ఈమె కాత్యాయ మహర్షి ఇంట పుత్రికగా అవతరించినదని మఱియొక కథయు గలదు. ఈమె భాద్రపద బహుళ చుతుర్దశినాడు జన్మించెను (ఉత్తర భారత పంచాంగ సంప్రదాయమును అనుసరించి ఈ దినము ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి). ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథులయందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.
కాత్యాయనీదేవి అమోఘఫలదాయిని. కృష్ణభగవానుని పతిగా బడయుటకు గోకులమునందలి గోపికలందఱును యమునానదీ తీరమున ఈమెను పూజించిరి. ఈమె వ్రజమండలమునకు (గోకులమునకు) అధిష్ఠాత్రిగా వెలసినది. ఈమె స్వరూపము దివ్యము భవ్యము. ఈమె శరీరకాంతి బంగారమువలె తళతళ మెఱయుచుండును. ఈమె నాలుగు భుజములతో విరాజిల్లుచుండును.

ఈమె కుడిచేతులలో ఒకటి అభయముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఈమె ఎడమచేతులలో ఒక దానియందు ఖడ్గము, వేఱొక దానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన. దుర్గానవరాత్రములలో ఆఱవరోజున కాత్యాయనీ స్వరూపము పూజింపబడును.
ఆ దినమున సాధకుని మనస్సు ఆజ్ఞాచక్రము నందు స్థిరమగును. యోగసాధనలో ఈ ఆజ్ఞాచక్రము యొక్క స్థానము ప్రముఖమైనది. కావున మనము అన్నివిధముల ఈ తల్లిని శరణుజొచ్చి, ఈమె పూజలయందును, ఉపాసనలయందును తత్పరులము కావలెను.
-
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!











Click it and Unblock the Notifications