మూలా నక్షత్రం - సరస్వతీ పూజ ఎలా చేయాలి ?
సరస్వతీం చతాం నౌమి వాగధిష్ఠాతృ దేవతాం
దేవత్వం ప్రతిపద్యంతే యదనుగ్రహతో జనా:
(అర్థం- వక్కుకు అధిష్ఠాన దేవత అయిన సరస్వతీ మాతా !, నీ అనుగ్రహం పొందిన వారు దైవత్వం కూడా పొందగలుగుతున్నారు)
అన్ని విద్యలకి అధి దేవత అయిన తల్లి సరస్వతీ మాత, ఆతల్లిని పూజించిన వారికి తద్వారా ఆమె అనుగ్రహం పొందినచో అన్నిరకాల ఆటంకాలు వాద్యాపరంగా తొలగిపోతాయి.)
దేవీ నవరాత్రుల 9 రోజులలో 9అలంకారాలతో పూజించడం అలవాటు. కానీ దేవీ మాహాత్మయం మొదలైన గ్రంథాలలో 9రోజుల పాటు 9 రూపాలు వేరుగా చెప్పారు. ( శైలపుత్రీ, బ్రహ్మచారిణి మొదలైనవి9) ఇవి కాకుండా వెంకటేశ్వర స్వామి 9రోజుల పాటు 9 వాహన సేవలు చెప్పబడింది.

ఇందులో ప్రత్యేకంగా చేసేపూజలలో అందరూ పాల్గొనేవి ఇవి.
కుమారీ పూజ,
శమీ పూజ,
ఆయుధ పూజ,
సరస్వతీ పూజ.
ఇప్పుడు ప్రత్యేకంగా సరస్వతీ పూజ విధానం గురించి చెపప్పుకుందాం.
మూలా నక్షత్రం, సప్తమినాడు వచ్చిన రోజున చేయ వలసింది ఈ పూజ.
వీలైన వారు గుడిలో, దేవీమంటపాలలో, లేని స్థితులలో ఇంటిలో సరస్వతీ పటం ఉంచి పూజించ వచ్చు.
సరస్వతీ పూజకి తెల్లపూలు వాడాలి.
చదువుకునే విద్యార్థులు ప్రత్యేకంగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వీలైతే తెల్లవస్త్రాలు, లేదా పట్టుబట్టలు ధరించాలి.
అమ్మవారిముందు తాము చదువుకునే పుస్తకాలుపెన్నులు, 2ఉంచి, అమ్మవారితో పాటు ఆయా పుస్తకాలు కూడా పూజించాలి.
అమ్మవారి నవరాత్రులలో 9రోజులకి 9దేవతలకి విడివిడిగా అష్టోత్తర నామాలు, సహస్ర నామాలు చదువుతూ పూజించాలి .
నైవేద్యం - క్షీరాన్నం, పాలతో బెల్లం నైయ్యివంటి పదార్థాలు కలిపి చేసినవి నివేదించాలి, చలివిడి వడపప్పు పానకం వంటివి ప్రత్యేక నైవేద్యాలు. నానబెట్టి మొలకలు ఎత్తించిన పెసర్లు, సెనగలు వంటి పదార్ధాలు చాలా మంచి ఫలితాలు
ఇచ్చే నైవేద్యాలు.
ప్రదక్షిణ, స్తోత్రాలు. వీలైనంత వరకు చేయాలి.
ఉపవాసం ఉండాలా ? - పదిహేను సంవత్సరాలలోపు పిల్లలు ఉపవాసం ఉండకూడదు. అసలు ఏమీ తినకుండా కూడా అమ్మవారిని పుజించకూడదు.












Click it and Unblock the Notifications