ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకునే రాశులవారికి బంగారు భవిష్యత్తు ఉంది

ఈ వారం ఏ రాశివారికి కలిసివస్తుంది? రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా అంతా సానుకూలమేనా? లేదంటే ప్రతికూలతలేమైనా ఉంటాయా? ఉంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? అనే విషయాలను జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

తులా రాశి
సకాలంలో పనులు పూర్తిచేయడంవల్ల విజయం సాధిస్తారు. ఉద్యోగంలో చేస్తున్న కృషిని పై అధికారులు గుర్తిస్తారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో సౌమ్యంగా మాట్లాడాలి. మొహమాటంవల్ల ఇబ్బందులుంటాయి. వ్యాపార విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వరుడిని ధ్యానించడంవల్ల విజయం కలుగుతుంది.

december 10th to 16th weekly horoscope

వృశ్చిక రాశి
వ్యాపార యోగం బాగుంది. ఆర్థికంగా బలోపేతమవుతారు. ఎవరి మాటలను మనసుకు పట్టించుకోవద్దు. సున్నితమైన విషయాల్లో లోతుగా ఆలోచించాలి. అపార్థాలకు తావులేకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలు శక్తినిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల శుభం జరుగుతుంది.

ధనుస్సు రాశి
ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సకాలంలో పనులు పూర్తిచేసుకోవడంవల్ల మంచి ప్రయోజనాలున్నాయి. వ్యాపారంలో వేసే ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి. పెట్టుబడులు లాభాలనిస్తాయి. లక్ష్మీదేవిని ధ్యానించాలి.

మకర రాశి
వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి. ఆలోచనల్లో ఎంతో స్పష్టత ఉండాలి. చంచలంగా తీసుకునే నిర్ణయాలవల్ల ఇబ్బందులుంటాయి. ఎప్పటి పనులను అప్పుడే పూర్తిచేయాలి. ఇష్టదేవతను స్మరించడంవల్ల మేలు జరుగుతుంది.

కుంభరాశి
అధికార యోగం ఉంది. స్థిరత్వం ఏర్పడుతుంది. ఆపద నుంచి బయటపడతారు. వ్యాపారంలో వర్తమాన పరిస్థితులకు తగినట్లుగా విస్తరిస్తారు. స్థిరత్వం ఏర్పడుతుంది. కొత్తగా చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

మీనరాశి
అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వాన్ని గురించి ఆలోచించడంవల్ల కార్యం సాధిస్తారు. పూర్వపుణ్యం కాపాడుతుంది. ఒక ఉపద్రవం నుంచి బయటపడతారు. మొహమాటంవల్ల ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ధర్మబద్దంగా తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల శుభవార్తను వింటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+