ఈవారం ఈ రాశులవారే అదృష్ట జాతకులు

జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నిర్దేశిత సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులవారికి అశుభ ఫలితాలు కలుగుతాయి. డిసెంబరు 17 నుంచి 23వ తేదీ వరకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఈ వారం ఎలా ఉండబోతోంది? మంచి ఫలితాలైతే పర్వాలేదు.. చెడు ఫలితాలుంటే వాటి నివారణకు ఏం చేయాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

తులారాశి : ఉద్యోగంలో స్థిరపడతారు. ఎదురుచూస్తున్న పని అయిపోతుంది. మనశ్శాంతి కలుగుతుంది. ఆపద నుంచి బయటపడతారు. ఆర్థికంగా బలోపేతమవుతారు. భవిష్యత్తు బాగుంది. శివుణ్ని ఆరాధించడంవల్ల మంచి జరుగుతుంది.

december 17th to 23rd weekly horoscope

వృశ్చిక రాశి : వ్యాపారం కలిసివస్తుంది. కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సకాలంలో బాధ్యతలు పూర్తిచేయండి. ఉద్యోగంలో మేలు కలుగుతుంది. నిరుత్సాహం పనికిరాదు. దగ్గరివారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఇష్టదేవతను స్మరించడంవల్ల శుభవార్తను వింటారు.

ధనుస్సు రాశి : అదృష్టం తోడుంటుంది. లక్ష్యం దగ్గరలోనే ఉంది. తొందర పనికిరాదు. నిర్ణయం తీసుకునేటప్పుడు అన్నివైపులా ఆలోచించి తీసుకోవాలి. చెడును ఊహించొద్దు. వ్యాపారం పర్వాలేదు అనేరీతిలో ఉంటుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చొద్దు. వారం మధ్యలో పని పూర్తవుతుంది. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల మేలు కలుగుతుంది.

మకర రాశి : ధర్మమార్గంలో పనులు పూర్తవుతాయి. మనోబలం ఉండాలి. బుద్ధిబలంతో సమస్యలను అధిగమించాలి. తెలియని విఘ్నాలు ఎదురవుతాయి. వాటిని శాంతంగా ఆలోచించుకొని పరిష్కరించుకోవాలి. పనులు వాయిదా వేయొద్దు. ఇష్టదైవాన్ని దర్శించడంవల్ల మేలు కలుగుతుంది.

కుంభరాశి : పదవీ లాభం కనపడుతోంది. బంగారు భవిష్యత్తు ఉంది. వ్యాపారం కలిసివస్తుంది. పెట్టుబడులు లాభాలనిస్తాయి. అన్నీ శుభఫలితాలే ఉన్నాయి. ఇంటి, వాహన యోగాలున్నాయి. స్థిరాస్తులు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని స్మరించడం శుభదాయకం.

మీనరాశి : అధికార లాభముంది. ప్రతిభతో పెద్దల్ని మెప్పిస్తారు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. మిత్రుల నుంచి సహకారం అందడంతోపాటు ఇబ్బందులు తొలగిపోతాయి. ఎవరితోను విభేదాలు వద్దు. సాధనపై దృష్టి పెట్టాలి. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల శుభవార్తను వింటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+