వారఫలాలు: ధర్మమార్గంలో నడవాలి... అద్భుత యోగం ఉంది
ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసొస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబ అంశాల్లో ఎటువంటి మార్పులు ఉంటాయి? అంతా సానుకూలమేనా? లేదంటే ఏవైనా ఇబ్బందులు ఉంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా తెలుసుకోవచ్చు. డిసెంబరు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
తులా రాశి
సకాలంలో పనిచేయడంవల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్తగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది. ధర్మమార్గంలో ఆలోచించడంవల్ల బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. సూర్య శ్లోకాన్ని పఠించాలి.

వృశ్చికరాశి
వ్యాపారంలో అద్భుత యోగాలున్నాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కలిసివస్తాయి. ఎదుటివారితో సౌమ్యంగా మాట్లాడాలి. కాలాన్ని మంచి పనులకు వినియోగించాలి. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల ఆపద నుంచి బయటపడతారు.
ధనుస్సు రాశి
అదృష్టం తోడుంటుంది. ఏకాగ్రతతో పనిచేయడంవల్ల విజయం సాధిస్తారు. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది. స్వల్ప ప్రయత్నంలోనే కార్యసిద్ధి ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు ఈ సమయంలో సులువుగా పూర్తవుతాయి. తక్కువగా మాట్లాడాలి. వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పవద్దు. లక్ష్మీధ్యానం శుభప్రదం.
మకర రాశి
నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవడంతోపాటు అంతే ధైర్యంగా వాటిని అమలు చేయాలి. ధర్మమార్గంలో నడవడంవల్ల అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో అభీష్ట సిద్ధి కలుగుతుంది. పట్టుదలతో వ్యాపారం చేస్తే ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆవేశంగా ఏ పని చేయవద్దు. ఇష్టదేవతను స్మరించడంవల్ల శుభవార్తను వింటారు.
కుంభరాశి
భూమి, ఇల్లు, వాహన యోగాలున్నాయి. ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు ఎంతో సావధానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అధికార యోగం ఉంది. విజయం సాధిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల సంతోషం కలిగించే వార్త వింటారు.
మీనరాశి
ఉత్సాహంగా పనులు ప్రారంభించాలి. దైవబలం ముందుకు నడిపిస్తుంది. అధికారులు అనుకూలంగా ఉంటారు. ఉద్యోగంలో వ్యతిరేకత తగ్గుతుంది. ఆశయం నెరవేరేవరకు వెనకడుగు వేయవద్దు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. తెలియని ఆటంకాలున్నాయి. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల శుభవార్త వింటారు.












Click it and Unblock the Notifications