నవరాత్రుల ప్రత్యేకం : మహాగౌరి
దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపమునకు మహాగౌరి అని పేరు.
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవప్రమోదదా
ఈమె పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును. ఈమె అష్టవర్షప్రాయముగలది అష్టవర్షాభవేద్గౌరీ ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళకాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన, ఈమె తన కుడిచేతులలో ఒక దానియందు అభయముద్రను మఱియొకదానియందు త్రిశూలమును వహించియుండును.
అట్లే ఎడమ చేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొక దానియందు వరముద్రను కలిగియుండును. ఈ ముద్రలలో ఈమె దర్శనము ప్రశాంతముగా నుండును. పార్వతి యవతారమునందు ఈమె పరమేశ్వరుని పతిగాబడయుటకు కఠోరమైన తపస్సును ఆచరించెను. వ్రియ్కేహం వరదం శంభుం నాన్యం దేవం మహేశ్వరాత్ (నారద పాంచరాత్రము). అనునది ఈమె ప్రతిజ్ఞ.

ఇట్టి కఠోర తపస్సు కారణమున ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరమును గంగాజలములచే ప్రక్షాళిత మొనర్చెను. తత్ప్రభావమున ఈమె శ్వేతవర్ణశోభితయై విద్యుత్‌కాంతులను విరజిమ్మెను. అప్పటినుండి ఈమె మహాగౌరి అని వాసిగాంచెను.
దుర్గానవరాత్రోత్సవములలో ఎనిమిదవ దినమున మహాగౌరి ఉపాసన విధ్యుక్తముగా నిర్వహింపబడుచుండును. ఈమె శక్తి అమోఘము సద్యఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగుచుండును. వారి పూర్వసంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులోగూడ పాపతాపములుగాని, దైన్యదుఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, అక్షయముగా పుణ్యఫలములను పొందుదురు.
-
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications