దేవీ నవరాత్రులు: కాళరాత్రి స్వరూపం

ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ
వామపాదోల్లపల్లోహలతాకంటక భూషణా వర
మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ

దుర్గామాత ఏడవ శక్తి కాళరాత్రి అను పేర ఖ్యాతివహించినది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరైయుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమెకు గల త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరించుచుండును.

ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనుపముండ్ల ఆయుధమును, మఱొక ఎడమచేతిలో ఖడ్గమును ధరించియుండును.

Devi Navaratrulu: kala Ratri swarupam

కాళరాత్రి స్వరూపము చూచటకు మిక్కిలి భయానకము కాని ఈమె ఎల్లప్పుడును శుభఫలములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను శుభంకరి అనియు అందురు. కావున భక్తులు ఈమెను జూచి ఏ మాత్రము భయమును గాని ఆందోళననుగాని పొందనవసరమేలేదు.

కాళరాత్రిమాత దుష్టులను అంతమొందించును. ఈమెను స్మరించినంత మాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు భూతప్రేతపిశాచములు భయముతో పాఱిపోవుట తథ్యము ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు, మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రమును ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.

కాళరాత్రిమాత విగ్రహమును హృదయమునందు నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసింపవలెను యమనియమ సంయమములను పూర్తిగా పాటింపవలెను. త్రికరణ శుద్ధి కలిగియుండవలెను. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించువారికి కలుగు శుభములు అనంతములు. మనము నిరంతరము ఈమె స్మరణ ధ్యానములను, పూజలను చేయుట ఇహపర ఫలసాధకము.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+