వాస్తు ప్రకారం ఇంటికి ఈశాన్యం పెంచుకోవాలనుకుంటున్నారా?
వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకుంటారు. ఇందులో కీలకమైన దిశ ఈశాన్యం. ఈ దిక్కు బాగుంటే జీవితం అద్భుతంగా ఉంటుందనేది ప్రతి ఒక్కరిలో నాటుకుపోయింది. అయితే కొన్నిసార్లు ఏ సందర్భంలో ఈశాన్యం పెంచుకోవాలి? ఏ సందర్భంలో పెంచుకోకూడదు అనే విషయాలను కూడా తెలుసుకోవాలి. ఒకవేళ తూర్పు - ఈశాన్యం పెరుగుతూ పోతే దాన్ని స్థిరపరుచుకోవాలి. అలాగే తూర్పు - ఉత్తరంలో ఉత్తర ఈశాన్యం పెరిగినా స్థిరపరుచుకోవాలి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
గోడ చతురస్రాకార కోణంలో రాకూడదు
ఒక్కోసారి ఈశాన్యం పెరిగినా అది ఇంటికి తోకలా ఉంటుంది. అన్ని దిక్కుల్లో తేడాలు వస్తాయి. అమరిక అనేది సరిగా ఉండాలి. నిర్మాణం చేసే సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోను ఎవరూ ఈశాన్యం పెరగకుండా చూసుకోవాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి. కొంతమంది స్లాబ్ ను ఈశాన్యం, తూర్పు - ఉత్తర దిశలకు పెంచుతారు. అలా పెంచి గోడ నిర్మించకుండా గ్లాసు పెడతారు. ఎందుకంటే షో కోసం. వాస్తవానికి ఆ దిక్కులో గోడలు నిటారుగా కట్టాలి. తూర్పు, ఉత్తర దిశల్లో చతురస్రాకార కోణం రాకూడదు. అద్దాలు పెట్టినా గోడ కట్టి పెద్ద పెద్ద కిటికీలు కట్టడం తప్పనిసరి.

మన రాకపోకలను నియంత్రించేది తలుపులే
ఇంటికి ఉండే ప్రధాన తలుపులు కూడా మన రాకపోకలను నియంత్రిస్తుంటాయి. ప్రధాన ద్వారాలు ఎక్కడ, ఏ వైపు, ఎంత సైజులో పెట్టాలన్నది ఇల్లు కట్టుకునే ముందే నిర్ణయించుకోవాలి. దానికి కట్టుబడి ఉండాలి. కొంతమంది డూప్లెక్స్ ఇళ్లు కడుతుంటారు. డూప్లెక్స్ లో ఎన్ని ఫ్లోర్లు వేసినా అన్నింటికీ కచ్చితంగా తూర్పు వైపు, ఉత్తరంవైపే ద్వారాలు రావాలి. వాస్తు ప్రకారం అటువైపే ఉండాలి. అలా ఉన్నప్పుడు బాల్కనీలు కూడా ఉండాలని శాస్త్రం చెబుతోంది. ఇది తెలియకుండా పెట్టిన ద్వారాలు నీచ స్థితిలో ఉన్నాయోమో వాస్తు నిపుణుడిచేత పరిశీలింపచేసుకోవాలి. ఎందుకంటే ప్రతి అంతస్తుకు ఒకటైనా ఉండాలి కాబట్టి.












Click it and Unblock the Notifications