కన్యారాశిలో కేతువు... ఈ రాశులకు అష్టైశ్వర్యాలు, రాజభోగాలు
నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైన కేతువు తిరోగమన దిశలోనే పయనిస్తుంటారు. ఆయన సంచార ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరించేందుకు కేతువు 18 నెలల సమయం తీసుకుంటాడు. నెమ్మదిగా కదులుతుంటాడు. 2023 అక్టోబరు నెలలో కన్యారాశిలోకి ప్రవేశించిన కేతువు ఈ ఏడాది మొత్తం ఇదే రాశిలో సంచారం చేసి వచ్చే ఏడాది మే నెలలో రాశిని మార్చుకుంటాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై తీవ్రంగా ఉంటుంది. మూడు రాశులవారికి ఎనలేని సౌఖ్యాలను, ఆర్థిక ప్రయోజనాలను కల్పిస్తుంది.
మేష రాశి
ధన ప్రవాహం అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. గతంలో మొదలై నిలచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులన్నీ పూర్తవడమేకాకుండా ఆర్థికంగా కలిసివస్తాయి.

కర్కాటక రాశి
కేతువు సంచారం ఈ రాశివారికి అనేక లాభాలను తెచ్చిస్తుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతాయి. పెద్ద పెద్ద అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కొత్తగా ప్రారంభించే వ్యాపారాలు మంచి ఫలితాలను కలగజేస్తాయి. ఉద్యోగస్తులకు వారి వారి కార్యాలయాల్లో సహోద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి మద్దతు లభించి పనితీరుతో మంచి పేరును సంపాదించుకుంటారు.
వృశ్చికరాశి
అన్ని రంగాల్లో విజయాన్ని అందుకుంటారు. మీకు అద్భుతమైన జ్ఞానం పెరుగుతుంది. కొత్తగా ప్రారంభించే వ్యాపారాలు భవిష్యత్తులో మీకు మంచి పురోగతిని ఇస్తాయి. అలాగే కొత్తగా పెట్టే పెట్టుబడులు కూడా భవిష్యత్తులో మంచి రాబడులనిస్తాయి. ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగినంత ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులు లేదంటే స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు.












Click it and Unblock the Notifications