వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవ ధర్మం అంటే ఏంటీ ? వ్యక్తి ముఖ్యమా ? వ్యక్తిత్వమా ?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151

పని చేయడం నేర్చుకోవాలి, పెత్తనం కాదు...

1. ప్రేమ,అభిమానం ఉన్నచోట పేదరికం ఉండదు.

2. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారు చివరకు ఏ నీడ లేకుండా పోతారు.

3. వ్యక్తిని కన్నా వ్యక్తిత్వాన్ని ప్రేమించడంలోనే అందం, ఆనందం ఉన్నాయి.

4. గొప్ప గొప్ప వ్యక్తులు ఆశయాల కోసం జీవిస్తే, దుర్మార్గులు దురాశల కోసం జీవిస్తారు.

5. మంచి ఆశయాలున్నంత మాత్రాన ఏ పని సిద్దించదు. దానికి తగ్గ కృషి ,పట్టుదల ఉండాలి.

6. ఇవ్వడం నేర్చుకోవాలి, తీసుకోవడం కాదు- పని చేయడం నేర్చుకోవాలి, పెత్తనం కాదు.

7. బుద్ధిని స్థిరంగా, సక్రమమైన మార్గంలో నిలపగలిగిన వాడే ఆదర్శ మానవుడవుతాడు.

8. మంచి ఆలోచన మంచి పనికి దారితీస్తుంది.

9. భోగాలు పెరిగితే, రోగాలు పెరిగి కన్నీరు కార్చక తప్పదు. మితంగా, హితంగా, ప్రియంగా మాట్లాడాలి.

10. విజయాన్ని ఎలా సాధించాలో ఓటమిని చూసి నేర్చుకోవాలి. మన సుఖ సంతోషాలను ఎదుటివారితో పంచుకోవాలి.

ethics of mens astrology:

ప్రణవ స్వరూపం అమ్మ

ఈ సృష్టిలో అమ్మకు ఒక రోజు ఇవ్వడం ,కేటాయించడం ఏమిటి ప్రతి రోజు ప్రతీ క్షణం అమ్మదే కదా..?అమ్మ నాన్నలు ప్రాతస్మరనీయులు, అమ్మను ఎప్పుడు ఎళ్ళవేళలా గౌరవించాలి.అమ్మకు అంటూ ఒక రోజు కేటాయించే దౌర్భాగ్యపు సంస్కృతి భారతీయ హిందువులది కాదు.

మదర్స్ డే అని ఆ ఒక్కరోజు అమ్మ ఫోటో పది మందికి తెలిసేలా స్టేటస్ లు వాట్సప్,ఫేస్ బుక్ లో పెట్టుకుని మిగితా రోజులు తల్లిని మరచి పొమ్మనా అర్ధం అసలు మదర్స్ డే ఆంతర్యం ఏమిటి ..? అమ్మ సహాయం లేని పొందని రోజంటూ ఉంటుందా ఏ ప్రాణికే కాని.అమ్మ నాన్నలంటే ప్రతి బిడ్డకు కనిపించే ప్రత్యక్ష దైవాలు.ఆమ్మ గురించి ఈ ప్రకృతి ఏమంటుందో గమనిద్దాం.

అమ్మను మించిన దైవమున్నదా
ఈ సృష్టిలో అమ్మే గొప్పది

ఆకాశాన్ని అడిగితే చెప్పింది
అమ్మ ప్రేమ తనకంటే విశాలమైనదని

సముద్రాన్ని అడిగితే చెప్పింది
అమ్మ మనసు తనకంటే లోతైనదని
తెనెను అడిగితే చెప్పింది
అమ్మ ప్రేమానురాగం తనకంటే తీయనైనదని

కోయిలను అడిగితే చెప్పింది
అమ్మ పిలుపు తన పాట కంటే మధురమైనదని

కొవ్వొత్తిని అడిగితే చెప్పింది
అమ్మ త్యాగం తనకంటే కోటి రేట్లు ఎక్కువని

భూ తల్లిని అడిగితే చెప్పింది
అమ్మ అంటేనే ఓర్పు అని
ఓర్పు అంటేనే అమ్మ అని

కనిపించని దైవం కన్న
కనిపించే అమ్మే మిన్న

సిరిసంపదలు ఎన్ని ఉన్న అమ్మ ప్రేమను ప్రేమించని జీవితం సున్న
అమ్మ కోసం అంటూ ఒక ప్రత్యేకమైన రోజు ఏమిటి...?
365 రోజులు 24 గంటలు అమ్మవే...సంపూర్ణమయం అమ్మ.

కొత్త ఆచారాలు మనకొద్దు.ప్రతి క్షణం అమ్మ నమస్కరింప బడేదే,గౌరవించ బడేదే మన దేశ సంస్కృతీ చాలా గొప్పది.మన ఆచార వ్యవహాలను మనం పాటిద్దాం. జై శ్రీమన్నారాయణ.

English summary
Give me a day in this creation, what is it allocating for every moment every day? mother should always respect me.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X