వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి ఇంటి యజమాని తెలుసుకోవలసిన 'గృహ'వాస్తు..

ఏ సింహద్వార గృహమైనను, గృహము నిర్మించునపుడు దక్షిణ, పశ్చిమములు ఏక ఎత్తు పెట్టి, ఉత్తర - తూర్పుల యందు వసారాలు ఉంచి కట్టవలెను. 17. గృహంలో ఉండే నుయ్యిగాని, గొయ్యిగాని ప్రహరీ గుమ్మాలకుగాని, ఇంటి గుమ్మాలకుగ

|
Google Oneindia TeluguNews

ప్రపంచములో నివసించు ఏ దేశ వాసులైనను, ఏ కులమతములకు చెందిన వారైనను, వారికి తెలిసినను, తెలియక పోయినను వారు నివసించు గృహము యొక్క వాస్తుననుపరించియే సుఖదుఃఖములను అనుభవించుచున్నారు. కనుక గృహసులు మొట్టమొదట మంచి ప్లాటును సంపాదించుకొని తరువాత దానిని విజ్ఞడైన వాస్తు శాస్త్రవేత్త యొక్క సలహాననుసరించి యిలు నిర్మించుకొనుట ఉత్తమము.

గృహవాస్తు ఫలితాలు గృహమందలివారందర నుభవింతురు. కావున యజమాని గృహనిర్మాణ విషయమున అతిజాగ్రత్తగా యుండవలెను.గృహ నిర్మాణానికి ముందు ప్లాటునందు ఈశాన్య స్థలమున బోరింగునిగాని, బావినిగాని ఏర్పాటు చేసికొని ఆ నీటితోనే గృహ నిర్మాణము చేయుట మంచిది. ముందుగా ప్రహరి నిర్మాణము చేసి గృహనిర్మాణము ప్రారంభించవలెను.

గృహ నిర్మాణములో లెంటల్లెవెల్ మరియు సన్ షేడ్ వేయునపుడు ఉత్తరము, తూర్పు గృహాలకు ఈశాన్య, వాయువ్య, ఆగ్నేయాలు తెగిపోకుండా చూచుకొనవలెను.గృహమునకు పైకప్ప వేయునప్పడు నైరుతి ఎత్తుగా నుంచి, వాయువ్యము కన్న ఆగ్నేయము ఎత్తుగాను, ఈశాన్యము కన్న వాయువ్యము ఎత్తుగాను నుండునటు లెవెల్ సరిచేసుకొనవలెను.

every house owner should know these tips of vastu shastra

ఇతర అవసరాల కోసము గృహావరణలో గుంటలుగాని, చిన్నచిన్న మట్టి దిబ్బలు" గాని చేయకూడదు. అలమారాలన్ని కూడా దక్షిణ, పశ్చిమ గోడలలోనే ఉండునట్లు ఏర్పాటు చేసుకొనవలెను. దక్షిణ, పశ్చిమ సింహద్వార గృహములకు గడప ఎత్తు అరుగులుంచవలెను.తూర్పు, ఉత్తర సింహద్వార గృహములకు ఫ్లోరింగ్ లెవెల్కన్న పల్లముగా అరుగులుండునటుగా నిర్మాణము చేయవలెను.

గృహములోని ద్వారములు, కిటికీలు, ఉచ్ఛస్థానములో నుండునట్లమర్చు కొనవలెను.గృహములో ఏ గదులలో కూడ దిమ్మెలుగాని, పూజాపీఠములుగాని తూర్పు ఉత్తర ఈశాన్యములందు వేయరాదు. ప్రతిగది ఈశాన్యము నందు గృహసుడు ఖాళీగా నుంచవలెను. ఎలాంటి బరువులుంచకూడదు.

గృహసుడు తను నివసిస్తున్న గృహానికి తూర్పు - ఉత్తర ఈశాన్యంలో గల స్థలాలుగాని, భవనాలుగాని ఖరీదు చేయవలెను.
ఇంటికి గల దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి స్థలాలను కొనగూడదు. పడకగదిలో తలను దక్షిణంవైపు వుంచి నిద్రించునటుల ఏర్పాటు చేసుకొనవలెను.

లెట్రిన్, బాత్రూమ్లకు వెంటిలేషన్ బాగుగా వచ్చునటుల నిర్మించవలెను. గృహస్తుడు తమ ప్లానులు దక్షిణ భాగం గదులు పెద్దవిగను, ఉత్తర భాగం గదులు కొంచెము చిన్నవిగా మరియు పశ్చిమ భాగం గదులు కొంచెము పెద్దవిగను, తూర్పుభాగం గదులు చిన్నవిగను నుండునటుల చూచుకొనవలెను.

ఏ సింహద్వార గృహమైనను, గృహము నిర్మించునపుడు దక్షిణ, పశ్చిమములు ఏక ఎత్తు పెట్టి, ఉత్తర - తూర్పుల యందు వసారాలు ఉంచి కట్టవలెను. 17. గృహంలో ఉండే నుయ్యిగాని, గొయ్యిగాని ప్రహరీ గుమ్మాలకుగాని, ఇంటి గుమ్మాలకుగాని ఎదురుగా యుండకూడదు. కనుక గృహసులు ఈ వాస్తు శాస్తాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని గృహమును జాగ్రత్తగా నిర్మించుకొనవలెను.

English summary
A home other than being only a house to live, it is an increase of our mental space and indication of our identity. Every part of our life is profoundly laced with the design, decor and maintenance of our home. The meaning of vastu is dwelling, which is the home for god and humans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X