వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనిషి-మనసు: మనసును స్వేచ్ఛగా వదిలేయాలి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

మనసును స్వేచ్ఛగా వదిలేయకూడదు.

దానిలోని భావాల్ని నిత్యం కనిపెడుతుండాలి.

అసలు కొన్ని ఆలోచనలు మనిషికి తెలియకుండా లోపలికి ఎలా ప్రవేశిస్తాయా అనిపిస్తుంది ఒక్కోసారి.

అప్పుడు అతడు తనను తాను మరచి, వాటికి వశమవుతుంటాడు.

ప్రతి ఆలోచనకూ అవకాశమిస్తే, మనిషి తుపానులో ఇరుక్కుపోతాడు.

తనకు తానే గందరగోళ పరిస్థితి సృష్టించుకుంటాడు.

అందువల్ల అతడు తన మనసును ఎప్పుడూ వేయి కళ్లతో కనిపెట్టాలి.

Everyone should not leave their mind free!

ఒక భావాన్ని మనసు పట్టుకొని వస్తుంది. దానితో మనిషి స్నేహం చేసి, మరిన్ని భావాలకు ఆస్కార మిస్తాడు.

అవి మంచివైతే మంచి వైపు, లేదంటే చెడు వైపు లాగుతుంది.

మనసు పనిగట్టుకుని అన్నీ మంచి భావాలనే ఇవ్వదు.

అతడే ప్రతి భావనలోనూ మంచిని చూడాలి.

తన మనసుకు నిరంతర ధ్యానం ద్వారా శిక్షణనివ్వాలి.

ఒక్క ప్రతికూల ఆలోచననైనా రానివ్వకూడదు. దానికి అవకాశమూ ఇవ్వకూడదు.

పలు రకాల ఆలోచనలతో, మానవ జీవన ప్రయాణం చిల్లులు పడిన పడవలా మారుతుంది.

'నా సాధన అంతా నా మనసుతోనే' అనేవారు అరుణాచల రమణ మహర్షి .

ప్రతీ మనషీ కూడాను ధ్యానం ద్వారా తన మనసు యెుక్క తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించు కోవాలని ఆయన చెబుతుండేవారు.

గొప్ప భావాలనే మనిషి పోషించాలి.

భ్రమల్లోకి బలవంతంగా నెట్టే వూహల్ని మొగ్గలోనే ధ్యానం ద్వారా తుంచాల్సిన బాధ్యత అతడిదే.

వూహను ఉపయోగించుకునే నేర్పరితనం పెంచుకోవాలి.

వీటన్నింటికీ ముందు, అతడికి తెలియాల్సింది తన మనసు పోకడ !సంపర్కం తీరుతెన్నులు.

మనసు గురించి తెలియకుండా, ఆధ్యాత్మికతపై మాట్లాడే అవకాశమే మనిషికి లేదు.

అతడి సాధన అంతా మనసుతోనే! తను చేసే యుద్దం తన మనస్సుతోనే.

మనసు లోపలికి, తనలోకి తానే అతడు ప్రయాణించాలి.

తన అంతరంగ ప్రయాణం అద్భుతంగా సాగాలి.

అందమైన మనసు. రంగురంగుల మనసు. ఇంతవరకు ఒక ప్రపంచాన్ని చూపించింది.

మనసు లో ఎన్ని ప్రపంచాలో! వాటి నుంచి బయటకు వెళ్లాలి మనిషి.

అలా లేనప్పుడు అది పురోగమనం కాదు- తిరోగమనం!

మనసుకు మించిన దేవుడు లేడు.

నేను ను మించిన మంత్రం లేదు.

మనసులోనే అంతరాలయంలో మూల విరాట్టు సేదతీరుతున్నాడు.

నీలోపల దివ్యంగా ఉన్నాడు.

పాల సముద్రంలో శేషశయ్యపై పవళించి ఉన్నాడు

నీవు ధ్యానం చేసి మేల్కొలుపు.

మంచిగా మల్చుకొంటే

"నీ మనసే దైవం"

నువ్వే దైవం*

అహం బ్రహ్మాస్మి* అని ఓంకారం చెట్టుమీద గల ఆత్మపక్షి అరిచి చెబుతోంది.

అదొక దివ్యమైన, అద్భుతమైన, అపురూపమైన దృశ్యం. అనంతమైన అనుభూతి.

దాని కోసమే మనిషి జన్మించాడు.

తన మనసుతోనే అతడు బతుకుతాడు. ఆ మనస్సును ధ్యానం అనే అద్దంలోనే అన్నీ చూస్తాడు.

అంతరంగంలో అంతర్ముఖుడైనవాడికి ఆకలిదప్పులు ఉండవు.ఇంతకాలం ఏ మనసైతే అతణ్ని పట్టి పీడించిందో - అదే మనస్సు వేషం, భాషలు మార్చుకొని 'జ్ఞాన బ్రహ్మ'గా దర్శనమిస్తుంది.

అదే మనసు యెుక్క విశ్వరూపం! 'తన ధర్మం వైపు అడుగు వేసే ఉత్తమ మానవుణ్ని దేవుడుగా తయారుచేయడమే దేవతల లక్ష్యం.

ఆ లక్ష్యసాధనకు ముందుగా కావాల్సింది మనస్సును ధ్యానంతో వశపర్చుకోవడం.

'మర్రి విత్తనంలోనే మహావృక్షం ఉంది' అని పెద్దల మాట.

అలాగే సర్వ లోకాలూ మనిషి మనసులోనే ఉన్నాయి.

ఆలోకాలతోనే అతడికి పని.

ఆకాశంలా విశాలత్వం,
వాయువులా సర్వ వ్యాపకత్వం. మనిషికి
అవసరమవుతాయి.

మనసు సంపర్కం తేజస్సును అగ్నిలా, స్వచ్ఛతను జలంలా, సుగంధాన్ని మట్టిలా అనుభవంలోకి తెచ్చుకోవాల్సింది మనిషే!

తన మనసును దాటిపోవాల్సింది, హృదయంగా మారిపోవాల్సింది, దివ్యత్వాన్ని నలుదిశలా వ్యాపింపజేయాల్సింది అతడే!

మారిన మనసే ఉదాత్త హృదయం.

ఆ హృదయ నివాసి దైవమే! అలా అన్నింటినీ చూస్తుంటే, మనిషి మనసు నిర్మలమవుతుంది.

బుద్ధుడు బోధించినట్లు- తాపీగా ఒడ్డున ఉండండి. మనసును అలాగే నిశితంగా గమనిస్తుండండి.

ఏం జరుగుతుందో అప్పుడు మీరే చూడండి!

ఇదియే మనస్సు
యెుక్క విశ్వరూపమైన
"దైవ స్వరూపం".

English summary
When people mind pure? Every one should not leave their mind free.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X