ఫిబ్రవరిలో ఈ రాశుల తలుపు తడుతున్న లక్ష్మీదేవి... తీస్తారా? తీయరా?

ఫిబ్రవరి నెల మరో మూడు రోజుల్లో రాబోతోంది. ఈ నెల పలు రాశులకు ఎంతో పవిత్రమైందిగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నెలలో అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి. ముందుగా దేవగురువైన బృహస్పతి ఫిబ్రవరి నాలుగో తేదీన వృషభరాశిలోకి, ఆ తర్వాత సూర్యుడు 12న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడి సంచారం కూడా ఉంది. దీనివల్ల అన్ని ద్వాదశ రాశులపై ప్రభావం ఉంటుంది. ఏయే రాశులవారికి ఫిబ్రవరి నెలలో ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

తులా రాశి
జీవిత భాగస్వామికి కొత్త దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యేకమైన వ్యక్తులను కలుస్తారు. మాటను నియంత్రించుకోవాలి. వాతావరణంవల్ల ఆరోగ్యం బాగోదు.

february month horoscope all zodiac signs will use so many chances

మేష రాశి
భవిష్యత్తు కోసం బాగా కష్టపడాలి. అనుకోని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది.

వృషభ రాశి
పూర్తికాని పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. బాగా ఒత్తిడికి లోనవుతారు. అయితే మంచి అవగాహనతో దాన్ని అర్థం చేసుకొని బయటపడాల్సి ఉంటుంది.

మిథున రాశి
పాత విషయాల నుంచి, అనుభవాల నుంచి పాఠం నేర్చుకోవాలి. కష్టాల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంది.

కర్కాటక రాశి
ప్రేమ జీవితం బాగుంటుంది. జీవితంలో ముందుకు సాగే సమర్థతను పెంపొందించుకుంటారు.

సింహ రాశి
ఉద్యోగం మారాలనుకునేవారికి ఇది మంచి సమయం. ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలి.

కన్యా రాశి
మీకున్న సృజనాత్మకతవల్ల లాభం కలుగుతుంది. జీవితంలో ముందుకు సాగడానికి వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవద్దు.

తులా రాశి
ఈ సమయం వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఆదాయం భారీగా పెరగబోతోంది.

వృశ్చిక రాశి
అదృష్టం బాగుంది. పెట్టుబడి పెడితే బాగా కలిసివస్తుంది. అయితే ఎంతో ఆలోచించి పెట్టుబడి పెట్టాలి.

ధనుస్సు రాశి
ప్రేమ జీవితం సఫలమవుతుంది. పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల మీకు మంచి లాభం ఉంది.

మకర రాశి
ప్రతికూలమైన ఆలోచనలను తొలగించాలి. ప్రయత్నాలన్నీ సరైనదిశలో చేయాలి. అప్పుడే విజయవంతమవుతారు. పోగొట్టుకున్నవన్నీ లభిస్తాయి.

కుంభ రాశి
ప్రేమ జీవితం మంచి మార్గంలోనే ఉంది. ఈ నెలలో ఒకదాన్ని మీరు కోల్పోతారు. కానీ పశ్చాత్తాపపడకూడదు. గట్టిగా కృషిచేయాలి.

మీన రాశి
పాత విషయాలను ఎవరికీ చెప్పొద్దు. ఆదాయాన్ని పెంచుకునేందుకు కష్టపడాలి. ఆరోగ్యంగా ఉండేందుకు కూడా కష్టపడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+