ఫిబ్రవరి నెలలో ఈ రాశులకు షేర్ల నుంచి కనకవర్షం కురుస్తుంది
మరో వారం రోజుల్లో ఫిబ్రవరి నెల రాబోతోంది. కీలకమైన గ్రహాలు రాశి సంచారం చేయనున్నాయి. బృహస్పతి వక్రగమనం నుంచి మారడంతోతోపాటు శుక్రుడు, బుధుడు, సూర్యుడు తమ రాశులను మార్చుకుంటున్నాయి. ప్రస్తుతం వృషభరాశిలో వక్ర గమణంలో ఉన్న గురువు సరైన మార్గంలో పయనిస్తాడు. సూర్యుడు, బుధుడు కుంభరాశిలోకి, శుక్రుడు మీనరాశిలోకి సంచారం చేస్తాయి. ఈ ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటున్నప్పటికీ కొన్ని రాశులపై అధిక ప్రభావం పడుతోంది. ఆ రాశులవారు ఫిబ్రవరి నెలలో మహర్జాతకులు కాబోతున్నారు. వారి వివరాలను తెలుసుకుందాం.
వృశ్చికం
ఈ రాశివారు అర్ధష్టమ శని దశలో ఉన్నారు. అయినా మంచి ఫలితాలే కలుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. అంచనాలకు మించి ఆర్థికంగా ఎదుగుతారు. వారసత్వంగా రావాల్సిన ఆస్తులు చేతికి వస్తాయి.

మకరం
విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తిలో ఉన్నవారికి, ఉద్యోగంలో ఉన్నవారికి ఈ అవకాశం కలుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. బాగా ఉన్నవారి కుటుంబంతో సంబంధం కుదుర్చుకుంటారు. షేర్లు, స్టాక్ మార్కెట్ల నుంచి వీరికి కనకవర్షం కురుస్తుంది.
మేషం
ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. వేతనం కూడా భారీగా పెరుగుతుంది. ప్రతి పనిలోను విజయాన్ని అందుకుంటారు. ప్రయత్నం చేయడంతోనే అదృష్టం కలిసివస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పెరగడానికి అనేక మార్గాలు తోడవుతాయి. ఆర్థికంగా స్థిరపడతారు.
వృషభం
స్టాక్ మార్కెట్లు, స్పెక్యులేషన్లు వంటివి ధనలాభాన్ని తెస్తాయి. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉద్యోగాలు చేస్తున్నవారు మరో ఉద్యోగంలోకి మారతారు.
కర్కాటకం
రాదనుకున్న డబ్బు చేతికి అందుతుది. బాకీలన్నీ వసూలవుతాయి. లాభాలు భారీగా ఉన్నాయి. విదేశాలకు చెందిన సొమ్మును అనుభవించే యోగం ఉంది. పెళ్లి ప్రయత్నం విజయవంతమవుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది.
కన్య
వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి శుభవార్త అందుతుంది. ప్రేమ జీవితం ఉల్లాసంగా గడుస్తుంది.












Click it and Unblock the Notifications