దేవీ నవరాత్రులలో మొదటి రోజు శ్రీ బాలత్రిపురాసుందరిదేవి అమ్మవారి ప్రసాదము

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

దేవీ నవరాత్రులలో మొదటి రోజు శ్రీ బాలత్రిపురసుందరిదేవి అవతారం. అమ్మవారి ప్రసాదములు తయారు చేసే విధానం.

1. మొదటి రోజు శ్రీ బాలత్రిపురసుందరిదేవి అమ్మవారి అవతారం.

ప్రసాదములు తయారు చేసే విధానం:-

First day of Devi Navaratri:Goddess seen as Sri Balatripura Sundari devi,here is the pooja vidhan

!! పొంగల్ !!!! కావలసినవి !!

పెసరపప్పు 150 గ్రాములు
కొత్త బియ్యం 100 గ్రాములు
మిరియాలు 15
పచ్చిమిరప కాయలు 6
పచ్చి కొబ్బెర 1 కప్పు
కాచిన నెయ్యి 1/4 కప్పు
జీడిపప్పు 15
జీర 1/2 టేబల్ స్పూన్
ఆవాలు 1/4 టేబల్ స్పూన్
ఎండుమిర్చి 3
మినపప్పు , శనగపప్పు 2 టేబల్ స్పూన్స్
కొత్తిమిర , కర్వేపాకు తగినంత
ఉప్పు రుచికి సరిపడ
ఇంగువ 2 చిటికెళ్ళు.

చేయవలసిన విధానము:-

మదంగా ఉన్న పాత్రలో కాస్త నెయ్యి వేడి చేసి పెసరపప్పుని దోరగా వేయించండి. బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తరువాత బియ్యం కూడా బాగా వేయించాలి. తెలుపు రంగు పోకూడదు సుమారు 5 నిమిషాలు వేపితే చాలు పెసరపప్పు కూడ కలర్ మార కూడదు, అదే మూకుడులో మరికాస్త నెయ్యి వేసి జీడిపప్పులను వేయించి పెట్టడి. సన్నగా తరిగిన పచ్చి మిర్చి, పచ్చికొబ్బెరను కోరి, జీలకర్ర మిరియాలు వేయించిన బియ్యం పెసరపప్పు ఇవన్నీ 4 కప్పుల నీళ్ళతో కుక్కర్లో వుంచి మూడు విజిల్స్ వచ్చాక ష్టవ్ కట్టివేయడం చేయండి.

చల్లారాక అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు , జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కర్వేపాక్ వేసి తాలింపుపెట్టి మిగిలిన నెయ్యి అంతా పొంగలిలో వేసి వేడి వేడి ప్రసాదము ఆ తల్లి త్రిపురాసుందరీదేవికి నైవేద్యంపెట్టి భక్తిగా పూజించి ఈ దసరా 10 రోజులు మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ అని ప్రార్ధించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+