ఏప్రిల్ 20న తొలి సూర్య గ్రహణం... ఈ రాశులవారికి మోయలేనంత అదృష్టం!

సూర్య గ్రహణ ప్రభావం వల్ల ప్రకృతి విపత్తులు సంభవించడమే కాదు.. 12 రాశులవారిపై ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. కొన్ని రాశులపై తీవ్రంగా ఉంటే, మరికొన్ని రాశులపై పాక్షికంగా ఉంటుంది.

Solar Eclipse 2023: ఈ సంవత్సరానికి తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 20వ తేదీన ఏర్పడబోతోంది. అక్కడి నుంచి 15 రోజుల విరామంతో చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. 20వ తేదీ ఉదయం 7:04 గంటల నుంచి మధ్యాహ్నం 12:29 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడికి, భూమికి మధ్యన చంద్రుడు రావడంవల్ల సూర్య గ్రహణం ఏర్పడుతుంది.

మూడు రాశులవారికి చాలా బాగుంటుంది

మూడు రాశులవారికి చాలా బాగుంటుంది

గ్రహణం ఏర్పడటమనేది ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయమైనప్పటికీ జ్యోతిష్య శాస్త్రంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతి ఒక్కరు దీనికి ప్రభావితమవుతారు. గ్రహణం మనదేశంలో కనిపించనప్పటికీ రాశులను మాత్రం ప్రభావితం చేయబోతోంది. కొన్ని రాశులపై పాజిటివ్ గా, మరికొన్ని రాశులపై నెగెటివ్ గా ఈ ప్రభావం ఉంటుంది. సూర్య గ్రహణ ప్రభావం వల్ల ముఖ్యంగా మూడు రాశులవారికి బాగుంటుంది.

ఊహించని రీతిలో ప్రయోజనం

ఊహించని రీతిలో ప్రయోజనం

ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఉధృతంగా వస్తాయి. ఒకరకంగా ధనుస్సు రాశివారికి సూర్య గ్రహణం మోయలేనంత అదృష్టాన్ని తెస్తుందని పండితులు చెబుతున్నారు. మిథున రాశివారికి ఊహించని రీతిలో అకస్మాత్తుగా ప్రయోజనం కలుగుతుంది. సొంత వ్యాపారం ఉన్నవారికైతే.. వారి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. వృషభ రాశివారిలో ఉద్యోగస్తులైతే వేతనాలు పెరుగుతాయి.. పదోన్నతి కూడా వస్తుంది. ఈ మూడు రాశులవారి వైవాహిక జీవితం, కుటుంబ జీవితం సూర్య గ్రహణం వల్ల సంతోషంగా గడుస్తుంది.

40 రోజుల విరామంతో భూకంపం

40 రోజుల విరామంతో భూకంపం


ఏ గ్రహణానికైనా 40 రోజుల విరామంతో భూకంపం రావడం సహజంగా జరుగుతుంటుంది. అయితే గ్రహణం ఏర్పడటానికి, భూకంపం రావడానికి ఉన్న సంబంధమేదో తెలుసుకుందాం. భవిష్యత్తులో తలెత్తబోయే ప్రకృతి విపత్తుల గురించి గ్రహణాలు సంకేతాలిస్తాయని పండితులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో జంతు జీవాలు అసౌకర్యానికి లోనవుతాయి. సూర్య గ్రహణానికి 15 రోజులు ముందు లేదా తరువాత భూకంప ప్రకంపనలు నమోదవుతాయి. సూర్య గ్రహణం తరువాత దేశం, భూమికి సంబంధించిన విపత్తులు ఏర్పడతాయి. చంద్ర గ్రహణం సందర్భంగా సముద్ర విపత్తు అంటే నీటికి సంబంధించిన విపత్తు పెరగవచ్చు. అందుకే చాలా సందర్భాల్లో సునామీ వంటి ఘటనలు ఎదురవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+