5 శతాబ్దాల తర్వాత కోటీశ్వరులవబోతున్న రాశులు వీరే!
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. ఇవి కొన్ని రాశిచక్ర గుర్తులకు అంతులేని ప్రయోజనాలను కల్పిస్తుంటాయి. దాదాపు 5 శతాబ్దాల తర్వాత నవ పంచమ రాజయోగం ఏర్పడుతోంది. శక్తివంతమైన యోగాల్లో ఇది కూడా ఒకటి. దీనివల్ల ఏయే రాశులవారు ఎలా కోటీశ్వరులవబోతున్నారనే విషయాలను తెలుసుకుందాం.
మిథున రాశి
పండగలు, వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి వల్ల అదృష్టం కలిసివస్తుంది. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. కొత్త ఇంటి కోసం ఎప్పటినుంచో కంటున్న కల ఈ సమయంలో నెరవేరుతుంది. అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్లతో సంబంధాలు బలోపేతమవుతాయి.

కుంభ రాశి
కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. దాంపత్య జీవితం గతంలో కంటే ఇప్పుడు బలోపేతమవుతుంది. సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులందరితో కలిసి విహార యాత్రలకు వెళతారు.
తులా రాశి
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. భూముల కొనుగోళ్లు, అమ్మకాల ద్వారా డబ్బు వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాలు గడిస్తారు. కష్టపడి పనిచేసేవారికి వారి శ్రమకు తగిన ఫలితం వస్తుంది. కోర్టు సంబంధిత కేసుల్లో తీర్పులు వీరికి అనుకూలంగా వస్తాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఈ తరహా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.
సింహ రాశి
వీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. వ్యాపారంలో పలు ప్రయోజనాలు అందుకొని రాణిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా బలపడతారు. ఆర్థిక ప్రయోజనాలవల్ల ఇతరులకు కూడా సాయం చేస్తారు.
మీన రాశి
సమాజంలో మార్పు కోసం వీరు ఎంతో కష్టపడతారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఏ పనినైనా వీరు చాలా సులభంగా పూర్తిచేస్తారు. ఇతరులకు మంచి చేయడం కోసం తపిస్తుంటారు.












Click it and Unblock the Notifications