శనిదేవుడి దయతో ఈ రాశులవారు కుబేరులవుతారు
జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం కదలికకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ సంచార ప్రభావం 12 రాశులపై సానుకూలంగాను, ప్రతికూలంగాను ఉంటుంది. ఈనెల 18న శనిదేవుడు కుంభరాశిలో ఉదయించనున్నాడు. దీనివల్ల ఐదురాశులకు మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
ధనస్సు రాశి
ఈ రాశి జాతకులకు ఊహించని రీతిలో లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు. ఉద్యోగస్తులకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ పూర్తిచేయడానికి ఇది మంచి సమయం. వృత్తి రీత్యా ప్రయాణాలుంటాయి. అవి కూడా కలిసివచ్చేలా ఉంటాయి.

కన్యారాశి
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. ఇటీవలి కాలం నుంచి నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరగడంతోపాటు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విదేశాల్లో చదవాలనుకుంటున్న విద్యార్థులకు ఇది మంచి సమయం.
మిథునరాశి
శని ఉదయం ఈ రాశివారికి అత్యంత లాభదాయకం. ఉద్యోగస్తులకు బాగుంటుంది. ప్రమోషన్లు లభించడంతోపాటు నిరుద్యోగులకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.
సింహ రాశి
ఈ రాశివారికి మంచి లాభాలున్నాయి. ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడటంతోపాటు ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవడంతోపాటు మధ్యలో నిలిచిపోయిన డబ్బులన్నీ తిరిగివస్తాయి.
మేషరాశి
ఈ రాశివారి కుటంబ సంబంధాలు పటిష్టంగా ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం లభించడంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. శనిదేవుడి కటాక్షంతో ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయి.












Click it and Unblock the Notifications