డిసెంబరుకు 5 రోజులే.. ఈ రాశులే మహర్జాతకులంటున్న నవగ్రహాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిరాశులకు మంచి, మరికొన్ని రాశులకు చెడు ఫలితాలు కలుగుతుంటాయి. ఇది నిరంతర ప్రక్రియ. ఒకరికి ఉన్న కష్టాలు రేపు ఉండవు. ఈరోజు సుఖంగా ఉన్నవారికి రేపు కష్టాలు రాకుండా ఉండవు. జీవితకాలమంతా కష్టసుఖాల చక్రం తిరుగుతుంటుంది. డిసెంబరు నెలలో గ్రహాల, నక్షత్రాల కదలికలతో ఐదు రాశులవారు ప్రయోజనాలు పొందనున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.
కన్యా రాశి
డిసెంబరు అంతా వీరికి బాగుంటుంది. అన్నీ శుభవార్తలే అందుకుంటారు. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అందుకుంటారు. దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాన్ని స్థాపిస్తారు. అందులో విజయవంతంగా ముందుకు సాగుతారు.

మేష రాశి
అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీనివల్ల అన్ని పనుల్లో సులువుగా విజయాలను అందుకుంటారు. పెండింగ్ పనులన్నీ కదిలిస్తారు. ఏడాది చివరకు వాటిని పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది.
మీన రాశి
జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. డబ్బుకు లోటుండదు. కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.
తులా రాశి
ఈ రాశివారు జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. కష్టానికి తగిన గుర్తింపు లభించడంతోపాటు ధనానికి లోటుండదు. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. మతపరమైన కార్యక్రమాలపట్ల, భగవంతుడి పట్ల ఆసక్తి కలుగుతుంది.
సింహ రాశి
ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి కోరిక నెరవేరుతుంది. సవాళ్లు ఎదురైతే వాటిని ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఎదుర్కోవాలి. అటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి నిరంతరం సిద్ధంగా ఉండాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. కుటుంబంలోకి కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. దీనివల్ల సంతోషం మరింత పెరుగుతుంది.












Click it and Unblock the Notifications