ఈ నెల 27వ తేదీలోగా ఈ రాశులు కోటీశ్వరులవుతారు
గ్రహాలకు రాజైన సూర్య భగవానుడు ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. నవగ్రహాల్లో అతి తక్కువ సమయంలో రాశిని మార్చేది సూర్యుడు ఒక్కడే. ఈనెల 12వ తేదీన సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే అక్కడ గ్రహాల రాకుమారుడు బుధుడు ఉన్నాడు. వీరిద్దరి కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశులకు కీర్తి ప్రతిష్టలు కలిగి వారి జీవితంలో స్వర్ణయుగం నడుస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈనెల 27వ తేదీ వరకు ఈ యోగం ప్రభావం ఉంటుంది. మొత్తం ఐదు రాశులకు బాగా కలిసి రానుంది.
సింహ రాశి
అనుకోని రీతిలో వీరికి ధనం వస్తుంది. దీంతో కొత్తగా భూమిని లేదంటే భవనాన్ని, వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో కలలు కంటున్నవన్నీ నెరవేరతాయి. ఉద్యోగస్థులకు ఈ సమయం కలిసివస్తుంది.

వృశ్చిక రాశి
ఈ రాశివారి ఆదాయం పెరిగి సంపాదన పెరుగుతుంది. కొత్తగా ఆదాయ మార్గాలు దొరుకుతాయి. వాటిని ఉపయోగించుకుంటారు. నిలిచిపోయిన డబ్బును తిరిగి చెల్లిస్తారు.
మకర రాశి
సమాజంలో మంచి ప్రభావం కలిగించగలిగే వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు. ఇది వారికి అదృష్టం అని చెప్పొచ్చు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయాలున్నాయి.
వృషభ రాశి
వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరిస్తారు. దీనివల్ల ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. గతంలో రాదు అనుకున్న డబ్బు ఇప్పుడు చేతికి అందుతుంది. ఎదురయ్యే ప్రతి సమస్యను ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్థులకు వేతనాల పెంపు ఉంది. కొన్ని శుభవార్తలను అందుకుంటారు.
కన్యా రాశి
ఈ రాశివారికి ధైర్యం పెరగడంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మానసికంగా పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్థులకు లాభాలున్నాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ఈ రాశివారందరికీ ఆదాయ ఆర్జనకు దారులు దొరుకుతాయి.












Click it and Unblock the Notifications