ఆశ్లేషలోకి బుధుడు... ఈ రాశుల ఇంట్లోకి మహాలక్ష్మీ

గ్రహాల రాకుమారుడైన బుధుడు ఈనెల ఏడో తేదీన ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించాడు. బుధుడు తన నక్షత్రాన్ని మార్చుకోవడంవల్ల ఐదు రాశులవారికి అద్భుతంగా కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. తెలివితేటలకు, తర్కానికి, వ్యాపారానికి కారకుడు బుధుడు. ఏయే రాశులు ఏవిధంగా లాభం కలిసివస్తుంది? ఆర్థిక ప్రయోజనాలుంటాయనే విషయాన్ని తెలుసుకుందాం.

తులా రాశి
అనేక ఆర్థిక ప్రయోజనాలను ఈ రాశివారు పొందుతారు. వ్యాపారం కూడా బాగా కలిసివస్తుంది. తెలివితేటలు కలిగినవారు ఎవరైనా సలహా ఇస్తే దాన్ని జాగ్రత్తగా విని పాటించాలి. అప్పుడు కలిసివస్తుంది. అనేక శుభ ఫలితాలను పొందుతారు.

five zodiac signs will get all benefits and good health due to mercury entered aaslesha nakshatram

మీన రాశి
రీసెర్చ్ రంగంలో, రచనా రంగంలో, క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో విజయాలున్నాయి. ఆర్థికంగా మంచిగా ఉంటారు. మంచి స్థాయి వస్తుంది. తీసుకునే నిర్ణయాలు కూడా ఎదుటివారిని ప్రభావితం చేస్తాయి.

మిథున రాశి
కొత్తగా పనులు ప్రారంభించాలనుకునేవారికి ఇది మంచి సమయం. ఈ రాశి వారు వ్యాపారంలో విజయాన్ని అందుకుంటారు. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.

కన్యా రాశి
ఈ రాశివారు కొత్తగా అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థిక లాభాలను పొందుతారు. నిర్ణయం తీసుకునేముందు చాలా బాగా ఆలోచించి తీసుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. అలాగే బదిలీపై వెళతారు.

కర్కాటక రాశి
అనేక విజయాలను ఈ రాశివారు సొంతం చేసుకుంటారు. పెద్దల నుంచి, భార్య వైపు నుంచి ఆస్తులు కలిసివచ్చే అవకాశం ఉంది. న్యాయపరమైన వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. కుటుంబంలోని సమస్యలన్నీ తీరిపోతాయి. అందరూ సంతోషంగా ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+