ఈ రాశులపై వరాల జల్లు కురిపిస్తున్న బృహస్పతి

దేవతల గురువైన బృహస్పతి వివాహానికి, సంతానానికి, జ్ఞానానికి, జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు కారకుడు. ప్రస్తుతం పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తున్న గురువు వచ్చే నెల 19వ తేదీన అదే నక్షత్రం మూడో పాదంలోకి ప్రవేశించి అక్టోబరు 17వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల కొన్ని రాశులవారు సానుకూల ఫలితాలను పొందుతున్నారు. ఏయే రాశులవారికి ఈ పరిణామాలు మంచి చేస్తున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.

కుంభ రాశి
ఆర్థికంగా స్థిరత్వం దొరుకుతుంది. ధనలాభం ఉంది. ఉద్యోగస్థులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతి ఉంది. కొత్తగా ఉద్యోగం కోసం ఎదురుచూసేవారి కోరిక నెరవేరుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇబ్బంది లేదు. జీవిత భాగస్వామితో అధిక సమయాన్ని గడుపుతారు.

five zodiac signs will get all benefits and these are very lucky due to Jupiter will enter punarvasu nakshatram

మీన రాశి
ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. పనిచేసే కార్యాలయంలో ఒక పెద్ద ప్రణాళికలో భాగం పంచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆర్థిక లాభాలను అందుకుంటారు. వృత్తిలో దిగ్విజయంగా ముందుకు దూసుకుపోతారు.

మేష రాశి
వృత్తిలో మంచి పురోగతి ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అందరూ ఐకమత్యంగా ఉంటాయి. గొడవలన్నీ తగ్గుముఖం పడతాయి. ఆగిపోయిన డబ్బులు తిరిగి మీచేతికి అందుతాయి. కొత్త ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు వస్తాయి.

కర్కాటక రాశి
వ్యాపారస్తులు కొత్త ఒప్పందం కుదుర్చుకుంటారు. దీనివల్ల భారీగా లాభపడతారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. కెరీర్ లో విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. అన్నివిధాలుగా ఈ రాశివారు లాభపడతారు.

కన్యా రాశి
వ్యాపారంలో విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా గతంలోకంటే బలపడతారు. కుటుంబ సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది. విద్యార్థులకు చాలా మంచి సమయం. మంచి ఫలితాలను సాధిస్తారు. ఎదుటి వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+