ఈ రాశులను కుబేరులుగా చేస్తున్న చంద్రుడు.. ఎందుకంటే?
ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల, ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. ప్రధానంగా మనకు రాత్రివేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మనసుకు కారకుడు. మన మనసు చంచలంగా ఉన్నా, స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడు. ఆయన రాశుల్లో కాకుండా నక్షత్రాల్లో సంచరిస్తుంటాడు.
ఏ నక్షత్రంలో సంచార దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశిలో సంచారం చేసినట్లుగా జ్యోతిష్య పండితులు భావిస్తారు. ప్రస్తుతం చంద్ర దేవుడు నీడ గ్రహమైన రాహువు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తున్నాడు. ఈ ప్రభావం ఐదురాశులపై పడుతోంది. వీరు పట్టిందల్లా బంగారం కాబోతోంది. వాటి వివరాలు తెలుసుకుందాం.

తులా రాశి
ఓం:నమ:శ్శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబంలో విభేదాలున్నాయి. వీటిని చంద్రుడు తొలగింప చేస్తాడు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకుంటుంది. వీరి జీవితం కొత్త మార్గంలో పయనిస్తుంది. ఒకరకంగా డబ్బులు వర్షంలా కురుస్తాయని చెప్పొచ్చు.
మేష రాశి
ఈ రాశికి చెందిన ఉద్యోగస్థులకు వేతనం పెరగడంతోపాటు ప్రమోషన్ లభిస్తుంది. అన్నిరకాలుగా శుభ ఫలితాలే కలుగుతాయి. ఆకస్మికంగా ధనలాభం ఉంది. వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
సింహ రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలోని అనేక రంగాల్లో వీరికి అనుకూలంగా పనులు జరుగుతాయి. డబ్బు సంపాదనకు వీరికి అనేక మార్గాలను చంద్రుడు చూపిస్తాడు. వీటిని సద్వినియోగం చేసుకొని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత ఈ రాశులవారిపైనే ఉంటుంది.
మిథున రాశి
వ్యాపారంలో మంచి ఫలితాలను ప్రసాదిస్తాడు. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా మంచి సానుకూల పరిణామాలను కలుగజేస్తాడు. చేసే ప్రతి పనిలో ఆదాయం వచ్చేలా చంద్రుడు చూస్తాడు. వృత్తి, వ్యక్తిగత జీవితాలు రెండింటినీ సమంగా చూస్తారు.
కుంభ రాశి
వ్యాపారంలో డబ్బు మంచినీళ్లలా ఖర్చుచేసినప్పటికీ ఎంత ఖర్చు చేశారో అంత డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది. దీనివల్ల పోగొట్టుకున్న మనశ్శాంతి మీ దరికి చేరుతుంది. ప్రతి అడుగులోను కుంభరాశివారు విజయాన్ని సాధిస్తారు.












Click it and Unblock the Notifications