ఈ రాశులకు ఆస్తి కలిసివచ్చి ఇల్లు, కారు కొనుగోలు చేస్తారు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని సానుకూల ఫలితాలను, మరికొన్ని ప్రతికూల ఫలితాలను రాశిచక్ర గుర్తులకు కలుగజేస్తాయి. ఈనెల 16వ తేదీన చంద్రుడు కుంభరాశిలోకి సంచారం చేశాడు. రాహువు కూడా అదే సమయానికి ఇదే రాశిలో ఉండటంతో వీరిద్దరి కలయికతో గ్రహణ యోగం ఏర్పడింది. దీనివల్ల ఐదు రాశులవారికి అమోఘమైన ఫలితాలు కలుగుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
కుంభ రాశి
ఈ రాశివారికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు కూడా వ్యాపారస్తులు దక్కించుకుంటారు. వీటివల్ల వచ్చే లాభాలతో పాత అప్పులను తీర్చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అన్నిరకాలుగా వీరికి కలిసివస్తుంది. అందుకు అదృష్టం తోడుంటుంది.

మీన రాశి
విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ఎటువంటి వివాదాల్లోను తలదూర్చవద్దు. సమయం కలిసివచ్చు అదృష్టవంతులవుతారు. డబ్బులకు ఇబ్బంది లేదు. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
మేష రాశి
ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. అలాగే బదిలీ కూడా అవుతుంది. విదేశాల్లో ఉన్న పనులను పూర్తిచేసుకొని విజయం సాధిస్తారు. అనేక లాభాలను అందుకోవడంతోపాటు చాలామంది విదేశీ ప్రయాణం చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప విభేదాలు కూడా సమసిపోతాయి.
సింహ రాశి
వ్యాపారంలో పేరు తెచ్చుకుంటారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా మారతారు. మంచి ఫలితాలను ఈ సమయంలోనే అందుకుంటారు. గతంలో వదిలేసిన డబ్బు ఇప్పుడు మీ చేతికి వస్తుంది. పేరు ప్రతిష్టలతోపాటు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు.
ధనస్సు రాశి
కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థికంగా కొన్నాళ్ల నుంచి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కష్టపడితే ఫలితం దక్కుతుంది. కష్టానికి తగిన రీతిలో మంచి ఫలితాలను సాధిస్తారు. కొంతకాలం నుంచి పడుతున్న కష్టానికి ఈ సమయంలో ఫలితం దక్కుతుంది.












Click it and Unblock the Notifications