వాస్తు ప్రకారం ఇవి అనుసరించండి.. అంతేకానీ ఎవరి దగ్గరికీ పరిగెత్తొద్దు!

ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించుకునే సొంత ఆలోచనను ప్రజలు వదిలేస్తున్నారు. జాతకం ప్రకారమైతే జ్యోతిష్య పండితుల దగ్గరకు, వాస్తు ప్రకారమైతే వాస్తు నిపుణుల దగ్గరకు పరిగెత్తుతున్నారు. కష్టాలు వస్తే తట్టుకొని నిలబడాలి. సుఖాలు వచ్చినప్పుడు నిలకడగా ఉండాలి. దేనికీ పొంగిపోకూడదు.. దేనికీ కుంగిపోకూడదు. ఇంట్లో ప్రతి కూల శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కొన్నిరకాల వస్తువులు మనల్ని రక్షిస్తుంటాయి. వాటిగురించి తెలుసుకొని అనుసరించడంద్వారా సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేద్దాం. అంతేకానీ వారి దగ్గరకు, వీరి దగ్గరకు పరిగెత్తి డబ్బులు వదిలించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దు.

ఇంటి సింహద్వారం దగ్గర పంచముఖి ఆంజనేయుడి చిత్రపటాన్ని ఉంచాలి.
దీనివల్ల ప్రతికూల శక్తి ఇంట్లోకి రాదు.
పంచముఖి ఆంజనేయుడి చిత్రపటం దక్షిణ దిశలో ఉంటే మంచిది.
కుటుంబ సభ్యులందరికీ శ్రేయస్సు కలుగుతుంది.

Follow these guidelines according to Vastu Shastra but don t run to anyone for help

లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలను ఇంట్లో ఉంచాలి.
దేవుడి మందిరంలో కూడా ఉండేలా చూసుకోవాలి.
బుధవారం వినాయకుడికి గరిక, శుక్రవారం అమ్మవారికి కుంకుమ సమర్పించుకోవాలి.
దీనివల్ల డబ్బుకు కొరత ఏర్పడదు.

ఇంట్లో తులసి మొక్కను పెంచండి.
లక్ష్మీదేవికి ప్రతిరూపం తులసి.
ఈశాన్య దిక్కులో ఉంచాలి.
దీనివల్ల ప్రతికూల శక్తులన్నీ పారిపోతాయి.
కాకపోతే ఒకటి.. మొక్క ఎండిపోకుండా చూసుకోండి.
నిత్యం దీపారాధన చేస్తే మీకు అద్భుతంగా ఉంటుంది.

మంచినీటి కుండ ప్రతి ఇంట్లో ఈశాన్యం దిక్కులో ఉండాలి.
రాగి, ఇత్తడి, మట్టి పాత్రలను ఉపయోగించాలి.
ఈ పాత్రల్లో నీరు ఉండటంవల్ల కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+