ఈనెల 4వ తేదీ నుంచే ఈ 5 రాశుల తలరాత మారిపోయింది.. పరిశీలించుకోండి!
గ్రహాల సంచారం, వాటి కూటమి మన జీవిత గమనాన్ని మారుస్తుంటాయి. ఈ క్రమంలోనే జూలై 4 నుంచి జ్యోతిష్య శాస్త్రంలో ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన గ్రహాల కలయిక జరిగింది. విలాసాలకు కారకుడైన శుక్రుడు, ఆధ్యాత్మిక-రహస్య గ్రహమైన కేతువు పరస్పరం ఎదురెదురుగా రావడం వల్ల 'సమసప్తక యోగం' ఏర్పడింది. శుక్ర, కేతువుల ప్రభావం వల్ల ఐదు రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది.
తులా రాశి
తులా రాశి వారికి ఈ యోగం లాభ స్థానమైన 11వ ఇంట్లో ఏర్పడబోతోంది. పేరుకు తగ్గట్టే వీరికి ఆర్థికంగా ఊహించని మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతుంది. గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలిగిపోతాయి. వ్యాపారస్తులకు కొత్త డీల్స్ కుదురుతాయి. అన్నదమ్ములు, బంధువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరే సువర్ణ అవకాశాలు ఉన్నాయి.

కుంభ రాశి
కుంభ రాశి వారికి సప్తమ (7వ) స్థానంలో సమసప్తక యోగం ఏర్పడుతోంది. దీనివల్ల పెళ్లికాని యువతీ యువకులకు చక్కని వివాహ సంబంధాలు కుదురుతాయి. వివాహితుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలిగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం లాభాల పంట పండిస్తుంది. కుటుంబంతో కలిసి దూరప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి.
మేష రాశి
మేష రాశి వారికి ఈ యోగం పంచమ (5వ) స్థానంలో ఏర్పడుతోంది. దీనివల్ల విద్యార్థులకు అద్భుతమైన కాలం నడుస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తారు. సంతాన భాగ్యం కోసం ఎదురుచూసే దంపతులకు శుభవార్త అందుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పై అధికారుల మద్దతు లభించి, పదోన్నతులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి చతుర్థ (4వ) స్థానంలో ఈ యోగం కలగడం వల్ల స్థిరాస్తి, వాహన యోగాలు పడతాయి. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఇల్లు లేదా కొత్త బండి కొనే కల నెరవేరుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. తల్లిగారితో ఉన్న అపార్థాలు తొలగిపోయి, కుటుంబంలో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
సింహ రాశి
ఈ శక్తివంతమైన యోగం సింహ రాశిలోనే ఏర్పడుతుండటం విశేషం. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో సరికొత్త వెలుగు వస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఊహించని రేంజ్‌లో పెరుగుతాయి. మీ నైపుణ్యంతో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబంతో కలిసి సంతోషంగా గడపడానికి, ఒక కొత్త నిర్ణయం తీసుకోవడానికి ఇది అనుకూలమైన కాలం.














Click it and Unblock the Notifications