కుబేర యోగం ఏర్పాటు.. ఈ రాశులకు ఏడాది పొడవునా డబ్బులు
చాలారోజుల తర్వాత బృహస్పతి ఈనెల ఒకటో తేదీన మేష రాశి నుంచి వృషభరాశిలోకి సంచారం చేసింది. దీనివల్ల ఎంతో శక్తివంతమైన కుబేర యోగం ఏర్పడింది. ఈ ప్రభావం కొన్ని రాశులవారికి ఏడాది పొడవునా ఉండబోతోంది. సంతోషం, ఆనందం రెట్టింపు అవుతాయి. మరి కొన్ని రాశులవారికి ఊహించని రీతిలో డబ్బులు తిరిగివస్తాయి. జన్మరాశిలో యోగం శుభస్థానంలో ఉన్నవారికే ఈ ప్రయోజనాలు కలుగుతాయి. ఏయే రాశులవారికి ఏవిధంగా మేలు కలుగుతుందో తెలుసుకుందాం.
మేష రాశి
మాటతీరు మారుతుంది. దీనివల్ల విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆర్థికంగా గతం కంటే ఎంతో మెరుగవుతారు. వాహన సౌకర్యం పెరుగుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. కెరీర్ కు సంబంధించి మంచి పురోగతి సాధిస్తారు. గతం నుంచి వస్తున్న సమస్యలను ఈ సమయంలో సులువుగా పరిష్కరిస్తారు.

మిథున రాశి
తల్లిదండ్రుల నుంచి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సమాజంలో పనిచేస్తున్నవారికి కీర్తి ప్రతిష్టలు కోరకుండానే లభిస్తాయి. దీంతోపాటు కొందరు కొత్త కొత్త వాహనాలు, గృహాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో చర్చించి సామరస్యంగా చేసే పనుల్లో మంచి విజయాలు సాధిస్తారు.
కన్యా రాశి
విపరీతమైన లాభాలున్నాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారికి ధనలాభాలున్నాయి. ఎలాంటి పనులు ప్రారంభించినా సులభంగా విజయాలు దక్కుతాయి. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
వృశ్చిక రాశి
ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఎటువంటి లోటు ఉండదు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు ఉన్నాయి. ఆదాయ వనరులు రెట్టింపు అవుతాయి. వ్యాపారస్తులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంది.












Click it and Unblock the Notifications