100 ఏళ్ల తర్వాత యోగం.. ఈ 4 రాశులపై ప్రభావం.. మారనున్న జీవితం!
హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 100 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతం జరిగిందని పండితులు చెబుతున్నారు. అదేమిటంటే.. మీన రాశిలో గ్రహాల కలయిక. ఈ కలయిక నాలుగు రాశులవారికి రాజయోగం తీసుకువచ్చింది. అంతేకాకుండా ఊహించని రీతిలో ధనలాభం ఉండటంతోపాటు వీరి జీవితం కూడా మారిపోనుందని పండితులు స్పష్టంగా చెబుతున్నారు. ప్రతి గ్రహం తన రాశిని మారుస్తుంటుంది. అలా రాశి మార్చినప్పుడల్లా కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.. మరికొన్ని రాశులపై సానుకూల ప్రభావం ఉంటుంది. లాభనష్టాలు, కష్టసుఖాలనేవి సహజంగా జరిగే ప్రక్రియే. మీన రాశిలో సూర్య , బుధ, గురు గ్రహాల కలయిక ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం.
గ్రహాలకు గురువైన గురుడు మీనరాశిలో ఉన్నాడు. గురుడితోపాటు సూర్యుడు, బుధుడు కూడా ఇదే రాశిలో ఉన్నారు. తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది పర్వదినం రోజే చంద్రుడు గోచారం చేసి మీనరాశిలోకి ప్రవేశించాడని, ఒకే రాశిలో సూర్య, చంద్ర, బుధ, గురు గ్రహాలుండటం మహాద్భుతమని చెబుతున్నారు. దీనివల్ల 4 శుభయోగాలు ఏర్పడతాయి. బుధాదిత్యం, హంస యోగం, నీచభంగ యోగం, గజకేసరి యోగం. వందేళ్ల తర్వాత 4 రాజయోగాలతో మహా సంయోగం ఏర్పడటం తొలిసారి అవుతోంది. అందులోను ఉగాదిరోజు ఏర్పడింది. ఫలితంగా 4 రాశులవారి జీవితంపై విశేష ప్రభావం ఉంటుందని జ్యోతి ష్య శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులపై ఆ అద్భుత ఫలితాలు ఉన్నాయో పరిశీలిద్దాం.

* వృషభరాశివారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి. వీరు తమ జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ఆకస్మిక ధనలాభంతోపాటు వీరి ఆర్థిక పరిస్థితి కూడా ఊహించని విధంగా మెరుగుపడబోతోంది. అంతేకాకుండా ఆదాయానికి సంబంధించిన కొత్త మార్గాలు వీరికి లభిస్తాయి. పనులన్నీ త్వరగా పూర్తవుతాయి.
* మిథున రాశి జీవితంలో రాజయోగం కారణంగా అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి దక్కే అవకాశం ఉంది. జీతంలో పెరుగుదల ఉంటుంది. అధికారం, ప్రభుత్వ సంబంధిత పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు ఆర్జిస్తారు. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది.

* కన్యా రాశివారికి అన్నివిధాలుగా వారి జీవితం మెరుగుపడుతుంది. వారి జీవితంలో మంచి మార్పులు తీసుకురావడానికి ఇది కారణమవుతోంది. భాగస్వామిగా చేసే వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. పెద్ద పెద్ద డీల్స్ ద్వారా భారీమొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. వీరి కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.
*కుంభరాశివారికి ఈ సంయోగం ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది. కష్టాల నుంచి విముక్తి పొందడటంతోపాటు అదృష్ట యోగం వీరికి పనుల్లో విజయాన్ని చేకూర్చిపెడుతుంది. ఊహించని ధనలాభం ఉంటుంది.












Click it and Unblock the Notifications