ఏప్రిల్ 23 తరువాత ఈ రాశివారికి తీవ్ర ఇబ్బందులు..!

ఏప్రిల్ 23వతేదీ తర్వాత నుంచి నాలుగు రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. ఊహించని సమస్యలు వెంటాడటంతోపాటు వారికి ఆర్థిక కష్టాలు వెన్నాడతాయి. కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఏంచేయాలనేది పండితులు వివరిస్తున్నారు. హిందూ జ్యోతిష్యశాస్త్రంలో వివిధ గ్రహాలు వేర్వేరు రాశుల్లో పరివర్తనం చెందుతుంటాయి. ఈ పరివర్తనం వల్ల కొన్ని రాశులవారికి అనుకూలంగా, మరికొన్ని రాశులవారికి ప్రతికూలంగా ఉంటుంది. ఏప్రిల్ 23 తరువాత నాలుగు రాశుల వారికి కష్టాలు తప్పవని పండితులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ నెల అత్యంత మహిమాన్వితమైన నెల. ఈనెల 23వ తేదీ తర్వాత గురు, రాహు గ్రహాలతో యుతి ఏర్పడుతుంది. ఇలాంటి యుతి కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తెస్తుంది. అయితే నాలుగు రాశులవారికి మాత్రం దురదృష్టాన్ని తెస్తోంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో 7 నెలల వరకు తీవ్ర నష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. గురు చండాల యోగం ప్రభావమైతే మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ నాలుగు రాశులవారికి మాత్రం తీవ్ర ఇక్కట్లు తప్పవని చెబుతున్నారు.

మేష రాశి: గురు చండాల యోగం ప్రభావంతో ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఈ రాశి వారికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. శారీరకంగా, మానసికంగా శ్రమ పెరుగుతుందికానీ ఫలితం దక్కదు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల చదువు, ఆరోగ్యం సమస్యగా మారడమే కాక కోర్టు వివాదాలు ఇబ్బంది పెడతాయి. ఆర్ధిక సమస్యలు వెన్నాడతాయి.

 astrology

మిథున రాశి: గురు చండాల యోగం ప్రభావం మిథున రాశిపై తీవ్ర ప్రతికూలంగా ఉంటుంది. అన్ని విషయాల్లోను వీరికి కష్టాలు తప్పవు. కుటుంబ, ఆర్థిక విషయాల్లో అశుభ వార్తలను వినాల్సి ఉంటుంది. కుటుంబంలో జరగకూడదని ఘటన జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో తీవ్ర నష్టాలుంటాయి. పెట్టుబడి పెట్టడానికి ఏ మాత్రం అనుకూల సమయం కాదు.

కన్యా రాశి: గురు, రాహు గ్రహాల యుతితో ఏర్పడనున్న గురు చండాల యోగం ప్రభావం కన్యారాశి జాతకంపై ఎక్కువగా కనిపించబోతోంది. ఆర్ధిక సమస్యలు వెంటాడటంతోపాటు ఏపని చేసినా నష్టాలే కలుగుతాయి. ఎంత కష్టపడినప్పటికీ ఫలితం మాత్రం ఉండదు. కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరతాయి. ఆర్థిక సమస్యల కారణంగా అప్పులు చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలి.

horoscope

ధనస్సు రాశి: ఏప్రిల్ 23వ తేదీన ఏర్పడనున్న గురు చండాల యోగం ప్రభావం ధనస్సు రాశి జాతకులపై ఎక్కువగా ఉంటుంది. ప్రతి క్షణం వీరిని ఏదో తెలియని భయం వెంటాడుతుంది. అనారోగ్యానికి గురవుతారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+