ఈనెల 15వ తేదీ నుంచి 10 ఏళ్లపాటు చక్రం తిప్పబోతున్న రాశులు ఇవే
పవిత్రమైన కార్తీక మాసం ముగిసింది. తర్వాత మార్గశిర మాసం వచ్చింది. మార్గశిర మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. ఈనెల 15వ తేదీన మార్గశిర పౌర్ణమిని జరుపుకోబోతున్నాం. అదేరోజు శుక్రుడు, శనిదేవుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అంతేకాకుండా ఆరోజు కొన్ని అద్భుతమైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంది. దీనివల్ల కొన్ని రాశులకు మంచి లాభాలు, మరికొన్ని రాశులకు సాధారణ లాభాలు కలుగుతాయి. అత్యద్భుతంగా లాభాలను పొందబోయే రాశుల వివరాలను తెలుసుకుందాం.
కుంభం
ఈ రాశివారికి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. గతంలో ఈ రాశివారు నిలకడ లేని జీవితాన్ని గడిపారు. ఆస్తులు కొనుగోలు చేయడంతోపాటు ఆదాయాన్ని పెంచుకుంటారు. అంతేకాకుండా శుక్రుడి దయతో విలాసాలమీద ఎక్కువగా ఖర్చు పెడతారు. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త అప్పుల జోలికి వెళ్లరు.

మీన రాశి
ఆస్తులకు సంబంధించి కొంతకాలంగా కోర్టుల్లో నలుగుతున్న కేసులపై తీర్పులు అనుకూలంగా వస్తాయి. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కొంతకాలంగా ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి. అన్యోన్యంగా జీవిస్తారు. మీవల్ల మీ వంశానికి ఉన్నతమైన పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పరీక్షలన్నీ ఉత్తీర్ణులవుతారు.
కర్కాటకం
వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. అలాగే పెళ్లైనవారికి జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. సమస్యలన్నింటికీ ఈ సమయంలోనే పరిష్కారం దొరుకుతుంది. అన్ని వ్యాపారాలకన్నా స్థిరాస్తి వ్యాపారం బాగా కలిసివస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడి అవి మీకు లాభాలను తెచ్చిపెడతాయి.
సింహరాశి
ఈ సమయంలో ఇప్పటివరకు రావు అనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ముఖం చాటేసినవారు, డబ్బులు లేని సమయంలో ముఖం చాటేసినవారు ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. సోదరులతో ఏర్పడిన ఆస్తి తగాదాలన్నీ ఈ సమయంలో తీరిపోతాయి. అందుకు మార్గశిర పౌర్ణమే కారణం.












Click it and Unblock the Notifications