రాహువు బలపడటంతో ఈ రాశులవారు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు!
రాహువు ఛాయా గ్రహం. ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటుంది. మే 18వ తేదీన రాహువు కుంభరాశిలోకి ప్రవేశించాడు. సెప్టెంబరు 10వ తేదీన బలపడ్డాడు. దీనివల్ల మూడు రాశులవారికి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారని చెబుతున్నారు. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.
ధనస్సు రాశి
కొత్త కొత్త ఆదాయ మార్గాలు దొరుకుతాయి. మీడియా, పబ్లిక్ రిలేషన్స్ రంగాల్లో కొనసాగుతున్నవారితో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటారు. ఈ రంగాల్లో కొనసాగుతున్నవారికి బాగా కలిసివస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అదనపు ఆదాయం కోసం మార్గాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. వివాదాలన్నీ సమసిపోతాయి.

కుంభ రాశి
వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. భాగస్వామిగా చేసే వ్యాపారంలో అద్భుతమైన లాభాలున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి, ఇప్పుడు పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా భారీ మొత్తంలో డబ్బులను సంపాదించుకోగలుగుతారు. ఈ సమయంలో ఈ రాశివారు ఊహించనిరీతిలో విజయాలను అందుకుంటారు. సానుకూలమైన మార్పులతో జీవితాన్ని కొనసాగిస్తారు.
వృషభరాశి
అకస్మాత్తుగా జీవితంలోకి ఆనందం ప్రవేశిస్తుంది. సంతోషంగా ఉంటారు. డబ్బులు కూడా భారీ మొత్తంలో వస్తాయి. గతంలో కంటే ఆర్థికంగా బలపడతారు. పెద్ద పెద్ద కలలు కంటారు. అవి నెరవేరతాయి. విశేషమైన ప్రయోజనాలను పొందుతారు. జీవితంలో మంచి పురోగతి సాధ్యమవుతుంది.
మకర రాశి
ఈ రాశివారు భారీ మొత్తంలో డబ్బులు పొందుతారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. అందుకు తగిన విధంగా కష్టపడతారు. సమాజంలో పేరు వస్తుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఊహించనిరీతిలో లాభాలున్నాయి. మానసికంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది.












Click it and Unblock the Notifications