ఈ రాశులకు మోయలేనంత డబ్బును మోసుకొస్తున్న శనిదేవుడు

నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు న్యాయానికి ప్రతీక. నీతి, నిజాయితీగా ఉండేవారికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. ప్రతి రాశిలో సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు. అత్యంత నెమ్మదిగా కలిగే గ్రహం శని అని పేరు. అందుకే వ్యక్తి జాతకంలో శని ప్రభావం చాలా నెమ్మదిగా కదులుతుంటుంది. శని తర్వాత రాహువు, కేతువు నెమ్మదిగా కదులుతారు. వారు రాశిని మార్చడానికి 18 నెలల సమయం తీసుకుంటారు.

ఏప్రిల్ 28వ తేదీన శని గ్రహ సంచారంలో అనేక మార్పులు సంభవించాయి. అలాగే ఈ నెల ఏడో తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించింది. ఈ పరిణామాలన్నీ కలిపి కొన్ని రాశులకు అదృష్టాన్ని మోసుకొచ్చాయి. ఏయే రాశులకు ఎలా కలిసివస్తోందనే విషయాన్ని, వివరాలను తెలుసుకుందాం.

four zodiac signs will become millionaires and good name in society and goo health due to Saturn entered uttarabhadra nakshatram

కర్కాటక రాశి
ఆర్థిక పరిస్థితులు చాలావరకు మెరుగుపడతాయి. ఉద్యోగస్థులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతి ఉంది. అన్ని పనుల్లోను ఈ రాశివారు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కొత్తగా కారుతోపాటు ఇంటిని కూడా కొనుగోలు చేస్తారు. ఆస్తులు కలిసివస్తాయి. ఎప్పటినుంచో ఉన్న సొంతింటి కలను ఈ సమయంలోనే నెరవేర్చుకుంటారు.

తులా రాశి
కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించడంవల్ల భారీ మొత్తంలో లాభాలను ఆర్జించడంతోపాటు కొత్త ప్రాజెక్టుల్లో కూడా పెట్టుబడి పెడతారు. ఆర్థిక పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. అందరూ సంతోషంగా ఉంటారు. జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. డబ్బుకు సంబంధించి ఇబ్బంది లేకుండా జీవితం గడుస్తుంది. ఈ రాశివారు దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి.

మకర రాశి
డబ్బుకు సంబంధించిన సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే ఈ సమయంలో తొలగిపోవడంతోపాటు అంతా లాభదాయకంగా ఉంటుంది. పాత సమస్యల నుంచి కూడా బయటపడతారు. వాటికి పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలోపేతమవుతాయి. అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కొందరు విహార యాత్రలకు వెళతారు. కొన్నాళ్ల నుంచి వేధిస్తున్న మానసిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. మీ పనితీరుకు అందరినుంచి ప్రశంసలు లభించి మంచిపేరు తెచ్చుకుంటారు.

కన్యా రాశి
ఈ రాశివారికి ఈ నెల ఏడోతేదీ నుంచే ఆర్థిక ప్రయోజనాలు ప్రారంభమయ్యాయి. ప్రేమకు సంబంధించిన జీవితంలో ఉన్నవారి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు వస్తాయి. పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేసుకుంటారు. అదృష్టం కలిసివస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న రంగాల్లో విజయం సాధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+