ఈ రాశులకు 2025 పొడవునా సంపదల ఖజానా రాసిచ్చిన గ్రహాలు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాయి. ఇలా ప్రవేశించే క్రమంలో కొన్ని రాశులకు మంచి, మరికొన్ని రాశులకు చెడు ఫలితాలు ఎదురవుతుంటాయి. అంతేకాదు.. అద్భుతమైన యోగాలను కూడా గ్రహాలు ఏర్పరుస్తుంటాయి. 2025లో గ్రహాలన్నీ రాశిచక్రాలను మారుస్తున్నాయి. ఈ క్రమంలో నాలుగు రాశులవారు సమృద్ధిగా అదృష్టాన్ని, డబ్బును పొందుతున్నారు. దీనివల్ల వారి పరిస్థితులన్నీ మారిపోతాయి. ఏయే రాశులకు ఈ విధంగా జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఏడాది ప్రారంభంలో ఈ రాశివారికి అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని కుజుడి అనుగ్రహంతో అధిగమిస్తారు. జూన్ 9వ తేదీన గురుడు ఇదే రాశిలోకి సంచారం చేస్తాడు. దీనివల్ల ప్రేమమయ జీవితాన్ని పొందుతారు. వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల ఉంటుంది. అదృష్టం తోడుండటంవల్ల అనేకరకాల అవకాశాలు తలుపుతడతాయి. వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. బృహస్పతి దయతో మీరు కంటున్న కలలను నెరవేర్చుకుంటారు.

మీన రాశి
ఈ రాశివారు తమ తెలివితేటలతో కొత్త రంగంలోకి అడుగుపెట్టి విజయాన్ని సాధిస్తారు. వాటిల్లో అర్థవంతమైన మార్పుచేర్పులు చేసుకుంటూ ముందుకు వెళతారు. ప్రేమ జీవితం, దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను ఆర్జిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.
మేష రాశి
ఈ ఏడాది మొత్తం వీరికి బాగుంటుంది. మార్చి 29న సూర్యగ్రహణం ఉంది. గ్రహణం తర్వాత వీరి వ్యక్తిగత జీవితంలో అద్భుతాలు చోటుచేసుకుంటాయి. మంచి జీవితాన్ని అనుబవిస్తారు. రాహువు మార్చి 30వ తేదీన ఇదే రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తికి, అనురక్తిని వ్యక్తం చేస్తారు. అలాగే మే 24వ తేదీన శనిదేవుడు ఇదే రాశిలోకి, తర్వాత కుజుడు రానున్నారు. వీరంతా కలిసి వీరికి ఆర్థిక సంపత్తిని కలిగిస్తారు. సమాజంలో హోదాను, గౌరవాన్ని పొందుతారు.
మిథున రాశి
వీరికి సృజనాత్మక శక్తి ఎక్కువ. జీవితంలో ఎదగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎంతో సృజనాత్మకంగా, ఆలోచనాత్మకంగా ఉండాలి. దీనివల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు కలుగుతాయి. బృహస్పతి జూన్ వరకు మిథునరాశిలోనే ఉంటాడు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. స్నేహితులు, సన్నిహితుల నుంచి మద్దతుతో జీవితంలో మంచి అడుగులు వేస్తారు. డబ్బుకు ఇబ్బంది లేదు. రుణ సమస్యల నుంచి బయటపడటానికి ఈ డబ్బును ఉపయోగించుకోమని పండితులు సలహా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications