ఈ రాశుల దశ, దిశ మారుస్తున్న శనిదేవుడు.. మహర్జాతకులే
శనిదేవుడు న్యాయదేవుడు. నీతికి, నిజాయితీకి ప్రతీక. ధర్మం ప్రకారం నడుచుకునేవారికి మంచి ఫలితాలను ప్రసాదిస్తాడు. చెడు పనులు చేస్తే అంతకు రెట్టింపు స్థాయిలో కర్మ ఫలితాలను ఇస్తాడు. ప్రతి మనిషి తన జీవితకాలంలో ఒకసారి ఏలిననాటి శని ప్రభావానికి గురవుతారు. దీనివల్ల ఏదో జరిగిపోతుందని భయపడతారుకానీ జీవితం విలువ తెలిపేలా, కష్టం విలువ తెలిపేలా ఈ ప్రభావం ఉంటుంది.
ఆ సమయంలో సమస్యలన్నింటినీ అధిగమించిన వ్యక్తి ఉన్నతస్థాయికి చేరుకుంటాడు. ఎందుకంటే శని వెళుతూ వెళుతూ మంచి చేసి వెళతారు. అదే ఆయన గొప్పదనం. మీనరాశిలో జులై 13వ తేదీ నుంచి నవంబరు 28వ తేదీ వరకు 138 రోజులపాటు తిరోగమన దిశలో పయనించనున్నాడు. దీనివల్ల ఏయే రాశులపై ఏవిధమైన ప్రభావం ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం.

కన్యా రాశి
శత్రువుల నుంచి, ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వీటి నుంచి విముక్తి కలుగుతుంది. వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు మంచి లాభసాటిగా మారతాయి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నవారికి పై అధికారుల నుంచి మద్దతు దొరికి మంచి లాభాలను అందుకోవడంతోపాటు మంచిపేరు తెచ్చుకుంటారు.
వృశ్చిక రాశి
ఉద్యోగస్థులకు వారి కార్యాలయాల్లోని పై అధికారుల నుంచి సంపూర్ణమైన సహకారం అందుతుంది. ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. వేతనం పెరుగుతుంది. విద్యకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి మంచి పురోగతి ఉంది. పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. మరోవైపు ఆదాయం కూడా పెరిగి కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
ధనస్సు రాశి
వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరిస్తారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. మంచి లాభాలున్నాయి. డబ్బును పొదుపు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తిచేస్తారు. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం.. రెండూ చాలా బాగుంటుంది. విశేషమైన ప్రయోజనాలను శనిదేవుడి నుంచి పొంది సంతోషంగా ఉంటారు.
మేషరాశి
ఆర్థికంగా వీరి పరిస్థితి మెరుగుపడుతుంది. ధన ప్రవాహం ఉండటంవల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు ఆదాయం చాలా స్థిరంగా లభిస్తుంది. వచ్చిన ఆదాయాన్ని కొత్త పెట్టుబడులవైపు మళ్లిస్తారు. జీవితాన్ని స్థిరం చేసుకుంటారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీరి ఆరోగ్యం కూడా బాగుంటుంది.












Click it and Unblock the Notifications