ఈ రాశుల తలుపు తడుతున్న అదృష్ట దేవత
గ్రహాలకు రాకుమారుడైన బుధుడు తిరోగమనం చేస్తున్నాడు. గ్రహాలన్నీ నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. కొన్నిసార్లు తిరోగమన దిశలో ప్రయాణిస్తాయి. బుధుడు మీనరాశిలో ఇలా తిరోగమనం చేయడంవల్ల కొన్ని రాశులపై ప్రభావం పడుతోంది. మార్చి 15 వ తేదీ నుంచి తిరోగమనంలో బుధుడు తన ప్రయాణాన్ని ప్రారంభించి ఏప్రిల్ ఏడోతేదీ వరకు ఉంటాడు. ఈ కదలికలు కొన్ని రాశులపై ప్రభావం చూపించి వారికి ఆర్థికంగా మంచి ప్రయోజనాలను అందిస్తాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
కన్యా రాశి
వీరికి అన్నీ అదృష్టం కలిసివచ్చే రోజులే. డబ్బు బాగా వస్తుంది. జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి. అవసరాన్ని బట్టి మాత్రమే వస్తువులను కొనుగోలు చేయాలి. వ్యాపారస్తులకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు.

కుంభ రాశి
వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాట చాలా మధురంగా ఉండి ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు తలుపు తడతాయి. భాగస్వామ్యంతో వ్యాపారాలు చేస్తున్నవారికి మంచి లాభాలున్నాయి. తిరిగి రావాల్సిన డబ్బును, నిధులను ఈ సమయంలో పొందుతారు.
వృషభ రాశి
వీరు అడుగు పెట్టిన ప్రతి రంగంలోను విజయాలు సాధించడంతోపాటు ప్రతి పని విజయవంతంగా ముగుస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. ఆదాయాన్ని ఆర్జించేందుకు మార్గాలు తోడవుతాయి. ఉద్యోగంలో మంచి వృద్ధి ఉంది. మనసు ఆనందంగా ఉండి ధార్మిక కార్యక్రమాలు చేయడానికి మొగ్గుచూపుతారు. ఆధ్యాత్మిక వాతావరణానికి ఆసక్తి చూపిస్తారు.
కర్కాటక రాశి
వీరు ఏ పని తలపెట్టినా వెంటనే పూర్తవుతాయి. ప్రయాణాలు వీరికి బాగా కలిసివస్తాయి. కర్కాటక రాశివారికి ధనం ప్రవహిస్తుందని చెప్పొచ్చు. అన్ని పనుల్లోను ఆత్మీయుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారం చాలా బాగుంటుంది. పోటీపరీక్షలకు సిద్ధపడుతున్నవారికి మంచిరోజులు వస్తున్నాయని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications