జూన్ 7వ తేదీలోపు ఈ రాశులు కోటీశ్వరులవుతారు
నవగ్రహాల్లో కీలక గ్రహం కుజుడు. కుజుడు సంచారం చేస్తే కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ప్రతి నెలరోజులకు ఒకసారి తన రాశిని కుజుడు మారుస్తుంటాడు. ఇలా మార్చే క్రమంలోనే కొన్ని ఆర్థిక ప్రయోజనాలు, కొన్ని అద్భుత యోగాలు ఏర్పడుతుంటాయి. జూన్ ఏడో తేదీ వరకు కుజుడి ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని, ప్రధానంగా మకర రాశి, మేష రాశి, వృషభ రాశివారు మాత్రం ఎనలేని ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వారికి ఏవిధంగా కలిసివస్తుంది? ఎటువంటి లాభాలను అందుకుంటారు? అనే విషయాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
దాంపత్య జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు విజయాన్ని అందుకుంటారు. ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచి ఫలితాలను పొందుతారు. కుజుడి సంచారం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలుంటాయి. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు.

మిథున రాశి
అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి. కుజుడు మంచి ఆరోగ్యాన్నిస్తాడు. అయితే ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఎదురుకాదు. మొదటి నుంచి ఈ రాశివారు మితంగా మాట్లాడతారు. అలా ఉండటంవల్ల వీరికి కొన్ని సందర్భాల్లో ఎంతో మేలు కలుగుతుంది.
మకర రాశి
జీవితంలో అన్నీ సానుకూలంగా జరుగుతాయి. కొంతకాలం నుంచి దంతాలు, ఎముకల సమస్యలతో బాధపడుతున్నవారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అనవసరమైన వాదనలకు దిగకుండా ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది. లేదంటే వివాదాలు పెద్దవి అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. సంపాదించిన డబ్బును పొదుపు చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారు.
మేష రాశి
ఆరోగ్యం చాలా బాగుంటుంది. కొంతకాలంగా వేధిస్తున్న మానసిక సమస్యలన్నీ దూరమవుతాయి. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవసరమైతే ప్రయాణాలు మానుకోవడం ఉత్తమం. పెద్దల నుంచి, భార్యవైపు నుంచి ఆస్తి కలిసివస్తుంది. కుజుడు రాశి సంచారం ఈ రాశివారి నాలుగో ఇంట్లో ఉంటుంది.












Click it and Unblock the Notifications