ఆరుద్ర నక్షత్రంలోకి బృహస్పతి... ఈ రాశుల తలరాత మారుతోంది
దేవతల గురువైన బృహస్పతి ఆరుద్ర నక్షత్రంలోకి రేపు ప్రవేశించనుంది. దీనివల్ల ఈనెల 15వ తేదీ నుంచి కొన్ని రాశిచక్ర గుర్తులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వివాహానికి, సంతానానికి, ఆధ్యాత్మికతకు, జీవిత లక్ష్యం చేరుకునేందుకు తోడ్పడే గురువు ఆశీస్సులుంటే తిరుగులేని జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాహు నక్షత్రంలో సంచార దశలో ఉన్న గురువు ఆరుద్రలోకి రావడంవల్ల లాభపడే రాశిచక్ర గుర్తుల వివరాలను, వారికి ఏవిధంగా ప్రయోజనాలు కలుగతాయనే విషయాన్ని తెలుసుకుందాం.
మకర రాశి
ఈ రాశివారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న వివాదాల నుంచి బయటపడతారు. శుభవార్తలను వింటారు. అవి లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు చేసేవారికి చాలా బాగుంది. వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలున్నాయి.

కుంభ రాశి
డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. వేరేవారి నుంచి రహస్యంగా డబ్బును పొందుతారు. ఉద్యోగులు కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులంతా తీర్థయాత్రలకు వెళతారు. విద్యార్థులు విదేశాలకు వెళ్లాలంటే కష్టపడాల్సి ఉంటుంది. ఉన్న డబ్బును సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది.
మిథున రాశి
వ్యాపారాలు బాగుంటాయి. మంచి లాభాలతోపాటు ఆదాయం భారీగా పెరుగుతుంది. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో శాంతిసౌఖ్యాలు నెలకొంటాయి. ఇప్పటివరకు ఉన్న ఆందోళలన్నీ తొలగిపోతాయి. అదృష్టం కలిసివస్తుంది. అన్నిరకాలుగా మేలు జరుగుతుంది.
కన్యా రాశి
జీవితంలో సంతోషం పెరుగుతుంది. కొత్తగా ఇంటిని లేదంటే కారును కొనుగోలు చేస్తారు. కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం భారీగా పెరుగుతుంది. జీవితంలో సంతోషం పెరిగి శ్రేయస్సు కోరుకునేవారు ఎక్కువవుతారు.












Click it and Unblock the Notifications