రాహువుతో ఈ రాశులకు పట్టిందల్లా ప్లాటినం అవుతోంది
ఈ సంవత్సరంలో రాహువు శనిదేవుడి సొంత రాశి అయిన కుంభరాశిలోకి సంచారం చేస్తాడు. వాస్తవానికి రాహువు అంటే అందరూ భయపడతారు. ఎందుకంటే అది కీడు కలిగిస్తుందని నమ్ముతారు. ఎప్పుడూ తిరోగమన దిశలో ప్రయాణం చేసే రాహువు ప్రతి 18 నెలలకు ఒకసారి రాశిని మారుస్తుంటాడు. శనిదేవుడి తర్వాత అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహాలు రాహువు, కేతువు. ఈ రెండూ విడదీయరానివి. రాహువు కుంభరాశిలోకి ప్రవేశించడంతో ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుంది. వారికి కలిగే ఆర్థిక ప్రయోజనాలేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.
మకర రాశి
ఈ సంవత్సరం మీకు ఖర్చులు తగ్గుతాయి. డబ్బును పొదుపు చేస్తారు. భవిష్యత్తులో మంచి రాబడి వచ్చేలా చూసుకుంటారు. ఎదుటివారితో మాట్లాడే మీ విధానం వల్ల పనులు చాలా సులువుగా జరుగుతాయి.

వృషభ రాశి
ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అవి కూడా లాభసాటిగా ఉంటాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు. ఆర్థిక రంగాలకు సంబంధించిన వ్యాపారాల్లో మంచి వృద్ధి ఉంది. రాహువు అనుగ్రహం వల్ల ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి.
మేష రాశి
ఈ రాశివారి ఆదాయం భారీగా పెరుగుతుంది. కొంతకాలం నుంచి ఇబ్బంది పెడుతున్న రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. మంచి లాభాలను అందుకొని సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు రాహువును పూజించాలి.
మీన రాశి
ఈ ఏడాది మొత్తం ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం ఊహించనిరీతిలో లాభాలున్నాయి. ఆదాయం పెరగడంద్వారా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. వచ్చిన డబ్బును కొత్త వ్యాపారాలవైపు మళ్లిస్తారు. ఆధ్యాత్మిక వాతావరణంవైపు ఆసక్తి చూపిస్తారు.












Click it and Unblock the Notifications