గురువు వక్రగమనంతో ఈ రాశులపై సంపద వర్షం

దేవతలకు గురువైన బృహస్పతి జ్ఞానానికి, ఆధ్యాత్మికతకు, వివాహానికి, సంతానానికి, సంపదకు కారకుడు. ఆయన అనుగ్రహం ఉంటే చాలు.. జీవితం బాగుంటుంది. జీవిత లక్ష్యం వైపు నడిపిస్తాడు. సాధారణంగా సంవత్సరానికి ఒకసారి తన రాశిని గురువు మార్చుకుంటాడు. ఈ ఏడాది నవంబరు 11వ తేదీన కర్కాటక రాశిలో తిరోగమనంలో సంచారం చేయనున్నాడు. కర్కాటకం అనేది చంద్రుడి సొంత రాశి. తర్వాత డిసెంబరు నాలుగో తేదీన మిథున రాశిలో కూడా గురువు తిరోగమనంలోనే పయనిస్తాడు. ఈ స్థితిలో నాలుగు నెలలు ఉండే గురువు వల్ల కొన్ని రాశులకు అపారంగా కలిసిరాబోతోంది.

మిథున రాశి
మీ మాటలకు సమాజంలో మంచి విలువ ఉంటుంది. అంతేకాకుండా హోదా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఇదంతా గురువు వల్లే. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు అందుతాయి. కార్యాలయంలో కూడా హోదా పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టే సమయంలో పెద్దల సలహా తీసుకోకపోతే నష్టపోతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బృహస్పతిని పూజించాలి.

four zodiac signs will get amazing financial benefits and huge money due to Jupiter retrograde in cancer

తులా రాశి
వీరికి జీవితం చాలా గొప్పగా ఉండబోతోంది. వ్యాపారంలో కీలకమైన మలుపు చోటుచేసుకుంటుంది. సంపద పెరుగుతుంది. భారీ లాభాలను ఆర్జిస్తారు. కుటుంబం మొత్తం సంతోషంలో ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటిని గుర్తించి సద్వినియోగపరుచుకుంటే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. గురువుపై పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచాలి.

వృషభ రాశి
వీరికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. దీంతో ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తిచేస్తారు. కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్నవారికి మాత్రం ఈ సమయంలో బాగా కలిసివస్తుంది. వ్యాపారస్తులకు బాగుంది. ఒకరకంగా వీరికి అదృష్టం కలిసిరానుంది. అనేక ప్రయోజనాలు అందబోతున్నాయి.

కన్యా రాశి
నిపుణులైన ఉద్యోగులకు వారి వారి కార్యాలయాల్లో పదోన్నతి లభించి వేతనం పెరుగుతుంది. దీంతోపాటు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. భౌతికపరమైన జీవితానికి సుఖాలు పెరుగుతాయికానీ వాటికి అలవాటుపడకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే అలవాటు చేసుకోవాలి. మొత్తంగా ఈ రాశివారు సానుకూల ఫలితాలను అందుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+