మార్చి నెలలో 2 రాజయోగాలు.. ఈ రాశులకు రూ.2 కోట్లు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాయనే విషయం తెలిసిందే. మార్చి నెలలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అద్భుతం జరగనుంది. మీనరాశిలో ఎంతో శక్తివంతమైన రాహువు, బుధుడు, చంద్రుడు, శుక్రుడు కలవనున్నారు. వీరి కలయికవల్ల అత్యంత శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. అవేంటంటే.. లక్ష్మీ నారాయణ రాజయోగం, చతుర్గ్రాహి యోగం. ఈ యోగాల వల్ల కొన్ని రాశులకు చాలా బాగుంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మిథున రాశి
ఈ రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. దీంతోపాటు వారికి ఆర్థిక లాభం కూడా ఉంది. భార్య వైపు నుంచి ఊహించనిరీతిలో ప్రయోజనాలు కలిగి ఆర్థికంగా స్థిరపడతారు. దాంపత్య జీవితంలో ఉన్నవారు గొడవలన్నింటినీ తగ్గించుకొని పిల్లల కోసం కలిసిమెలిసి జీవిస్తారు.

వృషభ రాశి
ఈ రాశివారికి మిత్రుల నుంచి మంచి తోడ్పాటు అందుతుంది. దీనివల్ల ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్థులకు భారీ లాభాలున్నాయి. వారి వారి రంగాల్లో వీటిని ఆర్జిస్తారు. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు పైన తెలిపిన గ్రహాలకు పూజలు నిర్వహించాలి.
కర్కాటక రాశి
అదృష్టం తోడుండటంవల్ల వీరికి అన్ని పనులు సజావుగా సాగుతాయి. ఎంతో క్లిష్టమైన పనులను కూడా చాలా సులువుగా పూర్తిచేసి విజయాన్ని అందుకుంటారు. వీరికి ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి. చతుర్గ్రాహి యోగం వీరిని కుబేరులను చేస్తుందని చెప్పొచ్చు. విద్యార్థులు ఈ సమయంలో మంచి విజయాలను అందుకుంటారు.
ధనుస్సు రాశి
తల్లిదండ్రుల నుంచి ఊహించనిరీతిలో మద్దతు లభిస్తుంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. అందుకు అదృష్టం కలిసివస్తుంది. పెళ్లయిన వారికి భార్య వైపు నుంచి అత్తమామలద్వారా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిదండ్రుల నుంచి భారీగా ఆర్థికసాయం అందుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారు ప్రయత్నం చేయవచ్చు.












Click it and Unblock the Notifications