మార్చి రెండోతేదీ నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంపదకు, విలాసవంతమైన జీవితానికి, అదృష్టానికి, అందనికి, ఐశ్వర్యానికి, కళలకు, ప్రేమకు, భౌతిక సుఖాలకు కారకుడు. జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగండదు. ఈరోజు శుక్రుడు మీనరాశిలో తిరోగమనం చెందాడు. దీనివల్ల అన్ని రాశులు ప్రభావితమవుతున్నప్పటికీ ప్రధానంగా నాలుగు రాశులపై మాత్రం అధిక ప్రభావం పడుతోంది. శుక్రుడి తిరోగమనంవల్ల వీరు పొందుతున్న లాభాలను, కలిసివచ్చే విధానాన్ని తెలుసుకుందాం.

కన్యా రాశి
ప్రేమలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. అలాగే మీకు బాగా దగ్గరైన వ్యక్తుల మనసును గెలవాలనుకుంటారు. ప్రయాణాలు చేయడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. కుటుంబంలో సంతోషం నెలకుంటుంది. ఉద్యోగులు తోటి ఉద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. స్నేహితుల నుంచి మద్దతు దొరకడంతో మంచి ప్రయోజనాన్ని పొందుతారు.

four zodiac signs will get financial benefits and more money due to venus retrograde in pisces

మీన రాశి
వ్యాపారంలో గణనీయమైన లాభాలున్నాయి. మీ వ్యక్తిత్వం మెరుగుపడి మంచి పేరు తెచ్చుకుంటారు. బ్యాంకు ఖాతాలో డబ్బు పెరుగుతుంది. మంచి పేరు తెచ్చుకోవడంతోపాటు ఆదాయాన్ని ఆర్జించేందుకు అనేక మార్గాలు మీకు తోడవుతాయి.

మేష రాశి
మీరు ఎంతో ఇష్టపడేవారి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. దాంపత్య జీవితం బాగుంది. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. ప్రేమ సంబంధాన్ని అనుభవిస్తారు. మీ వ్యక్తిత్వంతోనే మీకు మంచి పేరు వస్తుంది. ఉద్యోగస్థులు తమ పై అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకొని నమ్మకాన్ని పొందుతారు. దీనివల్ల ప్రమోషన్లు వచ్చి వేతనాలు పెరుగుతాయి. పేరు రావడంతోపాటు సమాజంలో ప్రతిష్ఠ పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన పెండింగ్ పనులు కూడా ఈ సమయంలో పూర్తిచేస్తారు.

సింహ రాశి
కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. ఆస్తిక సంబంధించి కోర్టుల్లో ఉన్న వ్యవహారాల్లో మీరు శ్రద్ధ తీసుకోకపోతే నష్టపోతారు. వృత్తి నిపుణులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. సామాజికంగా మీరు పెట్టుకునే సంబంధాలు మీ వ్యాపారానికి పెట్టుబడి అవుతాయి. మంచి లాభాలను ఆర్జిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+