రాసిపెట్టుకోండి... 'సుకర్మ యోగం'తో ఈ రాశులవారు మహర్జాతకులవుతున్నారు

జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు దేవగురువైన బృహస్పతి సొంత రాశి ధనుస్సులో సంచారం చేయనున్నారు. ఇది ఎంతో ప్రత్యేకమైన సంచారం. పవిత్రమైన కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఐదో తిథి కావడం చాలా విశేషమైందిగా పండితులు పరిగణిస్తారు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ ప్రత్యేక రోజున రెండు యోగాలు ఏర్పడుతున్నాయి. ఒకటి రవి యోగం కాగా, మరొకటి సుకర్మ యోగం. ద్వాదశ రాశులవారిపై ఈ రెండు యోగాలు మంచి ప్రభావాన్ని చూపుతున్నాయి. వీరు ఊహించనిరీతిలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.

సింహ రాశి
వీరు చేపట్టే ప్రతి పనిలో సులువుగా విజయం సాధిస్తారు. ఆర్థిక సంబంధమైన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. చిరకాలంగా మీకున్న కోరికలన్నీ నెరవేరతాయి. భాగస్వామ్యంతో వ్యాపారాలు చేసేవారికి మంచి ప్రయోజనాలున్నాయి. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేసి మంచి లాభాలను పొందుతారు.

four zodiac signs will get healthy life and good healt and more monedy due to sukaram yogam november 2024

కర్కాటక రాశి
ఆరు, ఏడు తేదీల్లో వీరికి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను కలిగిస్తాయి. తెలివితేటలు పెరుగుతాయి. ఏ పనినైనా సులభంగా చేసే శక్తిని పొందుతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడంవల్ల ఊహించనిరీతిలో లాభాలను పొందుతారు.

మకర రాశి
ఈ సమయంలోనే వీరు శుభవార్తలను వింటారు. ప్రభుత్వానికి సంబంధించిన విషయాల నుంచి, పనుల నుంచి ప్రయోజనాలు దక్కించుకుంటారు. విద్యార్థులకు కలిసివస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. సంతోషం వెల్లివిరుస్తుంది. ఒక పని తలపెట్టినప్పుడు ఈ రాశివారు కచ్చితంగాఇష్ట దైవానికి పూజ చేయాలి.

మిథునరాశి
నేటి నుంచి వీరికి అంతా కలిసివస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఊహించనిరీతిలో లాభాలను పొందుతారు. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అత్యవసరమైన వస్తువులను కొనుగోలు చేయడంవల్ల డబ్బులను పొదుపు చేస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతోపాటు ఆమె మద్దతు లభించి పనులన్నింటినీ విజయంతంగా పూర్తిచేస్తారు. ఇద్దరూ కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు. విద్యార్థులకు కూడా ఈ సమయం కలిసివస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+