ఈనెల 16 నుంచి ఈ రాశుల సుడి తిరిగింది.... మట్టి పట్టుకున్నా బంగారమే
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాశులకు అద్భుత ప్రయోజనాలను కలిగించడంతోపాటు అద్భుతమైన యోగాలను కూడా ఏర్పరుస్తుంటాయి. మరికొన్ని రాశులకు మాత్రం వారు చేసుకున్న కర్మల ఆధారంగా చెడు ప్రయోజనాలు ఎదురవుతుంటాయి. ఈనెల 16న వృశ్చిక రాశిలో ప్రత్యక్షంగా సంచారం చేయబోతున్నాడు గ్రహాల రాకుమారుడు బుధుడు. దీనివల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
సింహరాశి
సానుకూల ఫలితాలే అందుకుంటారు. కుటుంబ జీవితం ఆనందంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు మొగ్గుచూపుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళదామనుకుంటారు. వ్యాపారస్తులకు, వృత్తిలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం. కుటుంబం కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి వెనుకాడరు.

మిథున రాశి
ఆర్థికంగా బలోపేతమవుతారు. పూర్వీకుల నుంచి ఆస్తి కలిసివస్తుంది. వ్యాపారంలో, వృత్తిలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ అభివృద్ధికి బాటలు పరుస్తాయి. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని విజయాన్ని అందుకుంటారు. వ్యాపారస్తులు మాత్రం ఇతరులను నమ్మకూడదు. మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ ఆలోచనల ప్రకారమే పనులు చేసుకోవాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది.
కుంభ రాశి
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అయితే ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. ఇస్తే అవి తిరిగిరావు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పనుల్లో ఇతరుల నుంచి, స్నేహితుల నుంచి మంచి సహాయం అందుతుంది. వీటిని సక్సెస్ చేస్తారు.
వృషభ రాశి
ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఇది మంచి సమయం. ఆర్థికంగా స్థిరపడతారు. పనిచేయడానికి ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. భాగస్వామితో వ్యాపారం చేసేవారికి మంచి లాభాలున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి పై అధికారుల నుంచి, తోటి ఉద్యోగుల నుంచి సహకారం అంది మంచి పేరు తెచ్చుకుంటారు. మంచి ఆరోగ్యంతో ఉంటారు.












Click it and Unblock the Notifications