దసరా నవరాత్రుల్లో ఈ రాశులవారిపై అమ్మవారి కనక వర్షం!

విజయ దశమి సందర్భంగా అమ్మవారు కొన్ని రాశులవారిపై కనక వర్షం కురిపించబోతున్నారు. దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యే సమయంలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు కదలికలు జరుపుతాయి. దీనివల్ల తల్లి దయతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడతాయి. నవరాత్రుల సందర్భంగా ఏయే రాశులవారు ఏవిధంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు? ఏవిధంగా వారిపై కనక వర్షం కురుస్తుందనే వివరాలను తెలుసుకుందాం.

సింహరాశి
కోరుకున్న కోరికలన్నీ పూర్తిగా నెరవేరడంతోపాటు ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. సంపదను పెంచుకుంటారు. ఆర్థికంగా వీరు ఊహించని రీతిలో లాభాలున్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వాటిని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. పిల్లలు చేసే పనులవల్ల మీకు కూడా గౌరవం కలుగుతుంది.

four zodiac signs will get huge money due to Vijaya dasami lord kanakadurga blessings

కన్యారాశి
అన్ని అంశాల్లో ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. ఊహించనిరీతిలో ధనలాభాలున్నాయి. అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారు అందులోని మాధుర్యాన్ని అనుభవిస్తారు. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. చేసే ప్రతి పనిలో గౌరవం కలుగుతుంది. జీవితంలో ఎప్పుడూ చూడని రీతిలో ధనలాభం ఉంటుంది.

వృషభ రాశి
ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతోషంగా ఉంటారు. ఊహించనిరీతిలో లాభాలుండటంతోపాటు విదేశీయానం కూడా ఉంది. కొన్నాళ్ల నుంచి విదేశాల్లో స్థిరపడాలనుకుంటున్నవారికి ఇది కలిసివచ్చే సమయం. విద్యార్థులకు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ప్రభుత్వ పరీక్షలు రాస్తున్నవారికి ఈ సమయం బాగుంది.

మిథున రాశి
ఆర్థిక రంగాల్లో పూర్తిగా స్థిరపడినవారికి అనుకోని మార్పులు కలుగుతాయి. మంచిగా పురోగమనిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. ఉద్యోగస్థులకు వేతనం పెరిగి పదోన్నతులు అందుకుంటారు. అక్కడ అందరి నుంచి సహకారం అందుతుంది. విశేషమైన ప్రయోజనాలను నవరాత్రుల సమయంలో పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+