ఈ రాశులవారిపై బంగారు తలంబ్రాలు పోస్తున్న రాహువు-కేతువు

రాహువు-కేతువు అంటే అందరూ భయపడతారు. కీడు తలపెడతాయని నమ్ముతారు. కానీ అవి మంచిని చేస్తాయని చాలామందికి తెలియదు. వీటిని నీడ గ్రహాలు అంటారు. ఎదుటివారికి మంచి చేస్తున్నప్పుడు ఇవి మంచి ఫలితాలనే ఆయా రాశులకు ప్రసాదిస్తుంటాయి. చెడు చేస్తుంటే చెడు ఫలితాలను కలిగిస్తాయి. జ్యోతిష్యం ప్రకారం రాహువు మే 18వ తేదీన మీన రాశి నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల అన్ని రాశులు ప్రభావితమైనప్పటికీ నాలుగు రాశులు మాత్రం ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభంతోపాటు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. అనేక అవకాశాలు తలుపు తడతాయి. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాలను తెలుసుకుందాం.

మకరం
పెళ్లయినవారు దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారస్తుల ఆర్థిక పరిస్థితి గతంలోకంటే ఇప్పుడు బాగా మెరుగుపడుతుంది. ఆదాయం రెట్టింపు అవడంతోపాటు ఇప్పటివరకు పెడుతున్న అనవసర ఖర్చులన్నీ తగ్గించుకుంటారు. ఇలా తగ్గించుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారికి అనేకరకాలుగా ఆర్థిక ప్రయోజనాలున్నాయి.

With Rahu and Ketu changing their signs in May people of all four zodiac signs will experience huge financial benefits and good health

మీనం
కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. మిమ్మల్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య నుంచి బయటపడతారు. దీర్ఘకాలికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న మీకు దాన్నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది.

మేష రాశి
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగస్తులకు మంచి పురోగతి ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరిగి ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేస్తారు. కొన్నాళ్ల నుంచి వేధిస్తున్న శారీరక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులు వారి వారి కార్యాలయాల్లో చేస్తున్న పనిపై పూర్తిగా దృష్టిపెడితే ఆర్థిక లాభం కలుగుతుంది. వ్యాపారస్తులకు మంచి ఆర్థిక లాభం కలుగుతోంది. రాహువు-కేతువు సంచారం వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది.

వృశ్చికం
ఆస్తిని కొనుగోలు చేస్తారు.. అది వీలు కుదరకపోతే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇప్పటివరకు వస్తున్న ఆదాయం మరింత పెరుగుతుంది. రోజువారీ ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన పనులను వేగంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి కలిగి తీర్థయాత్రలకు వెళతారు. ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+